నల్లకుబేరుల పేర్లు బయటపెడతా: కేజ్రీవాల్
పదిమంది నల్లకుబేరుల పేర్లతో సుప్రీంకోర్టులో త్వరలోనే అఫిడవిట్ దాఖలు చేస్తానని కేజ్రీవాల్ వెల్లడించారు.
నల్లధనాన్ని వెలికితీయడంలో బీజేపీ ప్రభుత్వం దాగుడు మూతలు ఆడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తాను పదిమంది నల్లకుబేరుల పేర్లతో సుప్రీంకోర్టులో త్వరలోనే అఫిడవిట్ దాఖలు చేస్తానని కేజ్రీవాల్ వెల్లడించారు. మొత్తం నల్లధనాన్ని వెలికి తీసేవరకు తన పోరాటం కొనసాగుతుందని ఆయన అల్టిమేటం జారీ చేశారు.
బ్లాక్మెయిల్ చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రభుత్వానికి దాదాపు 200 పేర్లు అందాయని, తాను ప్రభుత్వంలో ఉంటే తానే ఆ పేర్లన్నింటినీ బయట పెట్టేవాడినని సంచలన ప్రకటన చేశారు. మొదట్లో అరవింద్ కేజ్రీవాల్ కూడా కొంతమంది పేర్లను బయటపెట్టారు. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తానంటూ కొత్త సంచలనానికి దారితీశారు.


