కేశ సమస్యలకు హోమియో చికిత్స

కేశ సమస్యలకు హోమియో చికిత్స


చక్కని ఒత్తై జుట్టు కావాలని కోరుకోని వారు ఎవరుంటారు..! అలా నిగనిగలాడే అందమైన జుట్టు మన దైనందిన జీవితంలో తీసుకునే జాగ్రత్తలపై ఆధారపడి ఉంటుంది. తీసుకునే ఆహారం, తాగే నీరు, నివసించే ప్రదేశం, వాతావరణ మార్పులు, మానసిక, శారీరక సంబంధ సమస్యలు కూడా జుట్టుపై ప్రభావం చూపిస్తాయి. వీటన్నింటినీ ఓ పద్ధతి ప్రకారం శరీరానికీ అనుగుణంగా మార్చుకుంటూ... పౌష్టికాహారం, తాజా పండ్లు, కూరగాయలు, వ్యాయామం, యోగా మెడిటేషన్, రోజుకు కనీసం ఏడెనిమిది గంటల ప్రశాంతమైన నిద్ర వల్ల చాలా వరకు కేశ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. జుట్టు ఊడిపోవడానికి హార్మోన్ సమస్యలు, సర్జరీ, కేన్సర్, దానికి ఇచ్చే కీమోథెరపీ తదితర కారణాలుంటాయి. అధిక మొత్తంలో వెంట్రుకలు ఊడటం, లేదంటే తలలో కొన్ని భాగాల్లో (ప్యాచెస్) మాత్రమే ఊడిపోవడాన్ని హెయిర్ లాస్ అనవచ్చు. సాధారణంగా రోజుకు 60- 70 వెంట్రుకలు సగటు మధ్యవయస్సు వారికి ఊడవచ్చు.

 

ఈ కేశ సంబంధ సమస్యలు రెండు రకాలు

 1. పురుష సంబంధ బట్టతల: ముందు నుంచి వెనుకకు పొయ్యే వెంట్రుకల సమూహం. ముఖ్యంగా 25% మంది పురుషుల్లో ఈ సమస్య ఉంటుంది. 30 ఏళ్ల వయసు వారికి ఇది రావచ్చు.

 2. స్త్రీ సంబంధ బట్టతల: వంశపారంపర్యంగా వయసు, హార్మోన్ల లోపాలు, పీరియడ్స్ ఆగిపోవడం, తల ముందు భాగంలో అలాగే ఉండి... మిగిలిన మొత్తం భాగంలో పలుచబడుతుంది.

 

కారణాలు

1.అలోఫేషియా ఏరియేటా. చిన్నచిన్న ద్వీపకల్పాలుగా వెంట్రుకలూడతాయి. ముఖ్యంగా తలలో, గడ్డం భాగం, కనుబొమ్మలు, కంటిపాపలు. 2.ఆటో ఇమ్యూన్ డిసీజ్. 3.కాలిన గాయాలు. 4.సిఫిలిస్ 5.మందులు, కొన్ని రకాల యాంటీబయోటిక్స్. 6.మానసిక ఒత్తిడులు, శారీరక అధిక శ్రమ. 7. ఎక్కువగా షాంపూలు వాడటం. 8. వైరల్ జ్వరాలు, టైఫాయిడ్. 9. థైరాయిడ్, గర్భనిరోధక మాత్రలు వాడటం. 10. కాన్పు తర్వాత 11. వెంట్రుకలు లాగుట (హెయిర్ పుల్లింగ్) 12. రేడియేషన్ (కేన్సర్ కేసులలో) తర్వాత 13. చర్మ సంబంధ తల వ్యాధులు 14. ఓవరీ ట్యూమర్స్, ఎడ్రెనల్ గ్రంథి కంతులు.

 

కారణాన్నిబట్టి చికిత్స

ప్రతిరోజూ చికిత్సకు వచ్చే వాళ్లలో ముఖ్యంగా స్త్రీలు దీని గురించి బాగా చింతపడుతూ ఉంటారు. హోమియోలో వ్యాధి కారణాన్ని బట్టి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. గర్భవతిగా ఉన్నపుడు, కాన్పు తర్వాత వచ్చే హార్మోన్ సమస్యలను సరిచేయటం, పోషకాహార సమస్యలు, ఏదైనా విటమిన్, రక్తహీనత సరిచేసే మందులతో పాటు నేట్రంమూర్, పల్సటిల్లా, ఆర్నికా, జబొరాండి, సెపియా తదితర మందులు బాగా పనిచేస్తాయి. వీటిని డాక్టరు సలహా మేరకు తీసుకోవాలి.

 

అడ్రస్...

డా॥మురళి అంకిరెడ్డి ఎం.డి (హోమియో),  స్టార్ హోమియోపతి

సికింద్రాబాద్, కొత్తపేట, కూకట్‌పల్లి, నేరేడ్‌మెట్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి, హన్మకొండ - కర్ణాటక


 ఫోన్ : 90300 92040

 www.starhomeo.com

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top