భద్రత తగ్గింపుపై వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ | YS Jagan filed a petition in the High Court on Security Reduction | Sakshi
Sakshi News home page

భద్రత తగ్గింపుపై వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్

Sep 15 2014 8:51 PM | Updated on Sep 15 2018 8:43 PM

వైఎస్ జగన్మోహన్ రెడ్డి - Sakshi

వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఏపి రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రత తగ్గించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

హైదరాబాద్: ఏపి రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రత తగ్గించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జెడ్ కేటగిరిలో ఉన్న తనకు భద్రత తగ్గించారని  పిటిషన్‌లో పేర్కొన్నారు.  మావోయిస్టులు, ఫ్యాక్షనిస్టుల నుంచి తనకు ముప్పు పొంచి ఉందని తెలిపారు.

ప్రతిపక్ష నేతగా తనకు కేబినేట్ హోదా ఉన్నప్పటికీ,  ప్రభుత్వం భద్రతను కుదించడం ఆక్షేపణీయం అని పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే సెక్యూరిటీని తగ్గించారని తెలిపారు. మూడేళ్లుగా తనకు జెడ్ కేటగిరీ భద్రత ఉందని జగన్ ఆ పిటిషన్‌లో వివరించారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement