'ఎన్కౌంటర్ మానవ హక్కుల ఉల్లంఘనే' | Raghuveera reddy takes on chandrababu govt | Sakshi
Sakshi News home page

'ఎన్కౌంటర్ మానవ హక్కుల ఉల్లంఘనే'

Apr 7 2015 1:19 PM | Updated on Jul 28 2018 4:24 PM

'ఎన్కౌంటర్  మానవ హక్కుల ఉల్లంఘనే' - Sakshi

'ఎన్కౌంటర్ మానవ హక్కుల ఉల్లంఘనే'

శేషాచలం అడవుల్లో మంగళవారం జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ ముమ్మాటికి మానవ హక్కుల ఉల్లంఘనే అని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మంగళవారం హైదరాబాద్లో ఆరోపించారు.

హైదరాబాద్: శేషాచలం అడవుల్లో మంగళవారం జరిగిన కూలీల ఎన్కౌంటర్ ముమ్మాటికి మానవ హక్కుల ఉల్లంఘనే అని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మంగళవారం హైదరాబాద్లో ఆరోపించారు. అసలైన ఎర్రచందనం స్మగ్లర్లను ఎన్కౌంటర్ చేసి ఉంటే ఎవరూ బాధపడేవారుకాదని ఆయన పేర్కొన్నారు. కానీ మృతులంతా తమిళనాడు రాష్ట్రానికి చెందిన నిమ్న వర్గాలకు చెందిన వారని తెలిపారు.

అమాయకులైన కూలీలను హతమార్చడంపై సమగ్ర విచారణ జరిపించాలని టీడీపీ ప్రభుత్వాన్ని రఘువీరా డిమాండ్ చేశారు. ఈ ఎన్కౌంటర్ ఘటనపై జాతీయ మానవహక్కుల సంఘానికి లేఖ రాశానని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్లు ఎవరో తెలిసినా టీడీపీ ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేదని రఘువీరా... టీడీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement