టోల్ గేటును ఢీ కొట్టిన ఏపీ పోలీసులు | ap police hits toll gate with excessive speed to skip stop | Sakshi
Sakshi News home page

టోల్ గేటును ఢీ కొట్టిన ఏపీ పోలీసులు

Feb 11 2017 4:37 PM | Updated on Aug 29 2018 4:18 PM

టోల్ గేటును ఢీ కొట్టిన ఏపీ పోలీసులు - Sakshi

టోల్ గేటును ఢీ కొట్టిన ఏపీ పోలీసులు

ఎమ్మెల్యే రోజాను వాహనంలో హైదరాబాద్ తరలిస్తున్న ఏపీ పోలీసులు జిల్లాలోని పంతంగి టోల్ గేటు వద్ద దురుసుగా ప్రవర్తించారు.

నల్గొండ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాను వాహనంలో హైదరాబాద్ తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు జిల్లాలోని పంతంగి టోల్ గేటు వద్ద దురుసుగా ప్రవర్తించారు. అతివేగంగా వచ్చిన పోలీసుల వాహనం టోల్ గేటును ఢీ కొట్టి వెళ్లిపోయింది. వాహనాన్ని ఆపాలంటూ టోల్ సిబ్బంది పోలీసులను కోరినా ఫలితం లేకుండాపోయింది. రోజాను హైదరాబాద్ కు తీసుకొచ్చిన ఏపీ పోలీసులు మణికొండలోని ఆమె నివాసంలో వదిలివెళ్లారు. అంతకుముందు మహిళా పార్లమెంట్ సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన ఎమ్మెల్యే రోజాను పోలీసులు నిర్బంధించిన విషయం తెలిసిందే.

ఏపీ పోలీసుల దురుసు ప్రవర్తనతో రోజా కంటతడి పెట్టారు. సదస్సు కోసం వెళ్లిన రాష్ట్ర మహిళా నేతను అదుపులోకి తీసుకోవడంపై వైఎస్సార్సీపీ నేతలు ర్యాలీగా వెళ్లి ఏపీ డీజీపీని కలిశారు. రోజాను అక్రమంగా నిర్బంధించారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అయితే.. రోజా పోలీసుల అదుపులోనే ఉన్నారని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సాంబశివరావు చెప్పారు. సోషల్ మీడియాలో రోజా చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని ఆమెను గన్నవరం విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement