Breaking News

అభిషేక్‌ శర్మ అట్టర్‌ఫ్లాప్‌.. సంజూ శాంసన్‌ ఫెయిల్‌

Published on Sat, 11/29/2025 - 13:48

టీమిండియా స్టార్లు అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌.. అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025 ఎలైట్‌ రెండో రౌండ్‌లో ఇద్దరూ విఫలమయ్యారు. దీంతో అభిషేక్‌ శర్మ సారథ్యం వహిస్తున్న పంజాబ్‌ జట్టుకు.. సంజూ కెప్టెన్‌గా ఉన్న కేరళ జట్టుకు ఓటములు ఎదురయ్యాయి.

ఎలైట్‌ గ్రూప్‌-‘సి’లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా పంజాబ్‌- హర్యానా (Punjab Vs Haryana ) శుక్రవారం తలపడ్డాయి. జింఖానా మైదానంలో టాస్‌ గెలిచిన పంజాబ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హర్యానా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 207 పరుగులు సాధించింది.

సరిగ్గా 207 పరుగులే చేసి..
హర్యానా కెప్టెన్‌ అంకిత్‌ కుమార్‌ (26 బంతుల్లో 51), వన్‌డౌన్‌ బ్యాటర్‌ నిషాంత్‌ సింధు (32 బంతుల్లో 61) మెరుపు అర్ధ శతకాలతో అదరగొట్టగా.. ఆఖర్లో సుమిత్‌ కుమార్‌ (14 బంతుల్లో 28) వేగంగా ఆడాడు. ఫలితంగా హర్యానా ఈ మేర స్కోరు సాధించింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కూడా 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి సరిగ్గా 207 పరుగులే చేసింది. కెప్టెన్‌, విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్‌ శర్మ (Abhishek Sharma- 5 బంతుల్లో 6) దారుణంగా విఫలమైనా.. అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (37 బంతుల్లో 81), సన్వీర్‌ సింగ్‌ (16 బంతుల్లో 36 నాటౌట్‌) అదరగొట్టారు.

ఇక స్కోర్లు సమం కావడంతో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా హర్యానా గెలుపొందింది. సన్వీర్‌ సింగ్‌ (0), రమణ్‌దీప్‌ సింగ్‌ (1) విఫలం కావడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.

కేరళకు పరాభవం
మరోవైపు.. తొలి మ్యాచ్‌లో ఒడిశాను పది వికెట్ల తేడాతో చిత్తు చేసిన కేరళ.. శుక్రవారం నాటి రెండో మ్యాచ్‌లో మాత్రం విఫలమైంది. లక్నోలో రైల్వేస్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది.

నామమాత్రపు లక్ష్యంతో ఛేదనకు దిగిన కేరళకు ఆదిలోనే షాకులు తగిలాయి. గత మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన ఓపెనర్లు సంజూ శాంసన్‌, రోహన్‌ కణ్ణుమ్మల్‌ ఈసారి చేతులెత్తేశారు. సంజూ 25 బంతుల్లో కేవలం 19 పరుగులు చేయగా.. రోహన్‌ 14 బంతుల్లో 8 పరుగులే చేసి అవుటయ్యాడు. 

వన్‌డౌన్‌లో వచ్చిన అహ్మద్‌ ఇమ్రాన్‌ (12) సహా అబ్దుల్‌ బాసిత్‌ (7), సల్మాన్‌ నిజార్‌ (18), అఖిల్‌ స్కారియా (16), షరాఫుద్దీన్‌ (6) విఫలమయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎనిమిది వికెట్లు కోల్పోయిన కేరళ కేవలం 117 పరుగులే చేసింది. దీంతో రైల్వేస్‌ చేతిలో 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఇద్దరూ విఫలం కావడంతో..
ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ ఇలా విఫలం కావడం ఆందోళనకరంగా పరిణమించింది. తదుపరి మ్యాచ్‌లలో ఇద్దరూ సత్తా చాటి ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా డిసెంబరు 9- 19 వరకు భారత్‌- సౌతాఫ్రికా మధ్య ఐదు టీ20లు జరుగనున్న విషయం తెలిసిందే.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)