Breaking News

ప్రయాణికులను కాపాడాలన్న  సంకల్పమే నడిపించింది

Published on Fri, 10/02/2026 - 13:48

న్యూఢిల్లీ: ఫ్లై దుబాయ్‌ విమానంలో కో–పైలట్‌ దాడిలో తీవ్రంగా గాయపడి, రక్తమోడుతున్నా సరే ప్రయాణికులను కాపాడాలన్న సంకల్పం మాత్రం చెక్కుచెదరలేదు. తనకు ఏం జరిగినా ఫర్వాలేదు వారు బతికుంటే చాలు అని భావించారు. ఒకవైపు కత్తి దూస్తున్న కో–పైలట్‌తో పెనుగులాడుతూనే మరోవైపు కాక్‌పిట్‌ తలుపు తెరిచారు. అంతటి విపత్కర పరిస్థితిలో ఆయన తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే 174 మంది ప్రయాణికులను కాపాడింది. 

ఫ్లై దుబాయ్‌ విమానంలో భారతీయ కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌ ప్రదర్శించిన ధైర్య సాహసాలను ప్రపంచమంతా కొనియాడుతోంది. కష్టాల్లో ఉన్నప్పుడల్లా హనుమాన్‌ చాలీసాను పఠిస్తానని స్మిత్‌ చెప్పారు. విమానంలో తనపై దాడి జరిగిన తర్వాత కూడా హనుమాన్‌ చాలీసాను పఠించడం తనకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపారు. ఇదే విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పంచుకున్నారు. 

కో–పైలట్‌ దాడిలో గాయపడి, యూఏఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్మిత్‌ మచ్ఛార్‌తో శుక్రవారం మోదీ వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు. కెప్టెన్‌ ప్రదర్శించిన ధైర్యం, సమయస్ఫూర్తి, సంయమనాన్ని ప్రశంసించారు. ఆయన తీసుకున్న తక్షణ నిర్ణయం ఎంతోమంది ప్రాణాలను కాపాడిందని పేర్కొన్నారు. జరిగిన సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్మిత్‌ భావోద్వేగానికి గురయ్యారు. ‘మీరే నాకు స్ఫూర్తి’అని మోదీతో అన్నారు. ప్రధానమంత్రితో స్మిత్‌ ఏం చెప్పారంటే..  

అది అత్యంత క్లిష్టమైన సమయం  
‘‘దాడిలో గాయపడి కాక్‌పిట్‌లో నేలపై ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్నప్పటికీ ప్రయాణికులంతా సురక్షితంగా ఉండాలన్న దృఢ సంకల్పంతో నాలో మిగిలి ఉన్న శక్తితోనే సమయస్ఫూర్తిగా వ్యవహరించి విమానాన్ని కాపాడగలిగాను. అప్పుడు నేను నా ప్రాణాల కోసం పోరాడుతున్నాను. కానీ, ఇతరులు చనిపోకూడదని నిర్ణయించుకున్నాను. అది అత్యంత క్లిష్టమైన సమయం. 

ఏదో ఒకటి చేయకపోతే ప్రమాదం తప్పదని నాకు అనిపించిన క్షణం అది. కాక్‌పిట్‌లో నేను కిందపడి ఉన్నప్పటికీ, విమానం కిందకు పడిపోతోందని గ్రహించగలిగాను. సహ పైలట్‌ నన్ను కత్తితో పదేపదే పొడిచాడు. చాలా గాయాలయ్యాయి. అయినా సరే లేచి ఏదో ఒకటి చేయాలని నాకు నేను చెప్పుకున్నాను. 

ఆ సమయంలో నేను సరిగ్గా స్పందించకపోతే పరిస్థితి భయానకంగా మారుతుందని తెలుసు. 17 ఏళ్లుగా విమానాలు నడుపుతున్నాను, గత 11 ఏళ్లుగా కెప్టెన్‌గా ఉన్నాను. కళ్లు మూసుకున్నా కూడా విమానంలో ఏం జరుగుతుందో గుర్తించగలను. కాక్‌పిట్‌ తలుపు తెరవడమే తక్షణ మార్గమని ఆ క్షణంలో ఆలోచన వచ్చింది. తలుపు తెరిచిన వెంటనే మిగిలిన వారందరూ లోపలికి వచ్చారు. విమానాన్ని కాపాడడంలో వారందరూ నాతో సమానమైన పాత్ర పోషించారు. ప్రయాణికులను ఎలాగైనా కాపాడాలన్న సంకల్పమే నన్ను ముందుకు నడిపించింది. కళ్లముందే వారు మరణిస్తూ ఉంటే చూస్తూ ఉండలేను కదా!’’అని స్మిత్‌ పేర్కొన్నారు.  

మన సంస్కృతికి దూరం కాకూడదు  
ఈ ఘటన తర్వాత, భారతీయులు ఇతరుల ప్రాణాలు తీసేవారు కారని, పైగా ఇతరులను కాపాడటం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడే వీరులుగా దేశం గర్వంగా చెప్పుకోగలదని మచ్ఛార్‌తో ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఆ సమయంలో మీరు ఎన్నో గాయాలకు గురయ్యారు, ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితిలో పోరాడారు. మీ సొంత భద్రతను పక్కన పెట్టి, ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యతనిచ్చారు. 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని పెంచారు.

 మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను’’అని పేర్కొన్నారు. మోదీ ప్రశంసలకు మచ్ఛార్‌ ప్రతిస్పందించారు. హనుమాన్‌ చాలీసా పఠించడం గురించి మాట్లాడారు. ‘‘నాకు నొప్పి లేదా బాధ కలిగినప్పుడల్లా నా మనసులో మెదిలే విషయం హనుమాన్‌ చాలీసా పఠనమే. విమానంలో దాడి తర్వాత కూడా హనుమాన్‌ చాలీసానే పఠిస్తూ ఉన్నాను. ఆ దేవుడే నన్ను కాపాడాడని తెలుసు. మోదీని ఆదర్శప్రాయుడిగా, స్ఫూర్తిప్రదాతగా భావిస్తున్నాను.

 మీరు చేసిన ఫోన్‌కాల్‌ నాలో ఎంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపింది. నాకు ఎంతో గర్వంగా అనిపిస్తోంది. మీ నుంచి ఫోన్‌కాల్‌ రావడం నాకు గర్వకారణం. మీ ముందు ఇలా భావోద్వేగంతో రోదిస్తున్నందుకు క్షమించండి’’అని మోదీతో చెప్పారు. దీనికి స్పందిస్తూ.. నా ముందు కన్నీళ్లు పెట్టుకోలేకపోతే ఇక ఎవరి ముందు పెట్టుకుంటారని మచ్ఛార్‌తో అన్నారు. ‘‘అయ్యా, ప్రతిరోజూ ఉదయం నేను ప్రార్థన చేసుకునేటప్పుడు నా రెండేళ్ల కుమారుడు నా ఒడిలో కూర్చుంటాడు.

 అప్పుడు నేను అతడికి హనుమాన్‌ చాలీసా వినిపిస్తాను. ఎందుకంటే చిన్నప్పుడు నాకు కూడా అలాగే నేరి్పంచారు. మనం నేడు మన దేశానికి దూరంగా ఉన్నప్పటికీ, మన సంస్కృతికి మాత్రం దూరంగా ఉండకూడదు’’అని మచ్ఛార్‌ చెప్పారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తనను ప్రేమ, శ్రద్ధతో బాగా చూసుకుంటున్నారని తెలియజేశారు. కత్తిపోట్లను కేవలం ఒక గాయంగా చూడటం లేదని, అలా చేస్తే కోలుకోవడం మరింత కష్టమవుతుందని అన్నారు. దీనిని నెమ్మదిగా సాగే ఒక ప్రయాణంలా భావిస్తున్నానని వెల్లడించారు. తాను త్వరగా కోలుకొని, పూర్తి ఆరోగ్యవంతుడిగా మారుతానని విశ్వాసం వ్యక్తం చేశారు.  

 

అహింసకు అర్థాన్ని చెప్పారు  
స్మిత్‌ మచ్ఛార్‌ త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయని, చాలామంది భారతీయులు మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తున్నారని ప్రధాని మోదీ చెప్పారు. ‘‘మీరు ధైర్యవంతులు, మీకు స్వాగతం పలికేందుకు భారత్‌ ఎదురుచూస్తోంది’’అని కెప్టెన్‌తో అన్నారు. భగవద్గీత బోధనలు, విలువలతో తన బిడ్డను పెంచిన మచ్ఛార్‌ తల్లి గీతా బెన్‌ గురించి మోదీ ప్రస్తావించారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మచ్ఛార్‌తో మాట్లాడటానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. దేశ గౌరవాన్ని పెంచారంటూ మచ్ఛార్‌ను ప్రశంసించారు. 

ఆసుపత్రిలో ఆయనను చక్కగా చూసుకున్నందుకు సౌదీ అరేబియా, యూఏఈ ప్రభుత్వాలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ పైలట్ల ప్రతిష్టను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని, ఇకపై ప్రపంచం వారిని కొత్త కోణంలో చూస్తుందని మచ్ఛార్‌తో అన్నారు. ‘‘ఈ రోజు గాంధీ జయంతి. అహింస నిజమైన అర్థం ఏమిటో మీరు ప్రపంచానికి చాటిచెప్పారు’’అని శ్లాఘించారు. మచ్ఛార్‌ స్వస్థలం గుజరాత్‌. ఆయనతో మోదీ కొద్దిసేపు గుజరాతీ భాషలో మాట్లాడడం విశేషం. అనంతరం ఆ వీడియో కాల్‌ గురించి మోదీ సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. ‘‘కెప్టెన్‌ స్మిత్‌తో గర్వం, భావోద్వేగాలతో కూడిన ఒక చిరస్మరణీయ సంభాషణ జరిగింది’’అని పేర్కొన్నారు.  

ఇదీ చదవండి: మీరే నాకు స్ఫూర్తి.. మోదీతో మచ్చార్‌

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)