'టాలీవుడ్'కి క్లాస్ పీకుతున్న ప్రేక్షకులు

Published on Sat, 11/07/2026 - 16:50

'అసలు టాలీవుడ్ ఎటు వెళ్తోంది? ఒకప్పుడు కథ, కథనం, బలమైన భావోద్వేగాలు, కొత్తదనం ఉన్న సినిమాలు వచ్చేవి. ప్రేక్షకులు కూడా మరో ఆలోచన లేకుండా థియేటర్లకు వచ్చి వాటిని చూసేవాళ్లు. నచ్చితే సెలబ్రేట్ చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. చాలా మూవీస్‌లో సరైన కథ ఉండదు. కథనం ఆసక్తికరంగా సాగదు. పాత్రల్లో బలం కనిపించదు. కామెడీ పేరుతో ఏదో హడావిడి చేయడం. కమర్షియల్ ఫార్ములాని నమ్ముకోవడం తప్ప కొత్తగా ప్రయత్నించే చిత్రాలు చాలా అంటే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి'

'ప్రేక్షకులు మారుతున్నారు. వారి అభిరుచులు మారుతున్నాయి, ప్రపంచ సినిమా స్థాయి పెరుగుతోంది. కానీ మన టాలీవుడ్‌లో మాత్రం ఇంకా పాత ఫార్ములాలని పట్టుకుని దర్శకనిర్మాతలు సినిమాలు తీస్తున్నారు. కేవలం హిట్, కలెక్షన్లు మాత్రమే కాదు.. మంచి కథలు, గుర్తుండిపోయే పాత్రలు, అద్భుతమైన స్క్రీన్‌ప్లే ఉన్న సినిమాలు రావాలి. నిజంగా తెలుగు సినిమా ఎటు వెళ్తోంది? మన దర్శకులు కొత్తగా ఆలోచించే సమయం రాలేదా?'.. ఇలా సగటు ప్రేక్షకుడు తమ బాధన్ని, ఆవేశాన్ని వెళ్లగక్కుతున్నారు. హీరోలు, దర్శకనిర్మాతలని గట్టిగా క్లాస్ పీకుతున్నారు. మరి మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే నిజంగా తెలుగు సినిమా వెనకబడిపోయిందా?

(ఇదీ చదవండి: సూర్య సూపర్ 'సీన్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు?)

ప్రస్తుతం సినిమా అనేది చాలారకాలుగా అందుబాటులో ఉంది. తెలుగులో స్టార్ హీరోల సినిమాలని థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకుడు ఇష్టపడుతున్నారు. మిడ్ రేంజ్ హీరోల మూవీస్ అయితే చాలా బాగుంటేనే బిగ్ స్క్రీన్లపై చూస్తున్నారు. లేదంటే ఓటీటీకి వచ్చాక చూసుకుందాంలే అని అనుకుంటున్నారు. లేదంటే పూర్తిగా చూడటమే మానేస్తున్నాడు. దానికి తోడు ఈ ఏడాది తమిళంలో వచ్చిన డీసీ, జైలర్ 2, బత్తా, బ్లాస్ట్, వీరభద్రుడు, డోరతి, మొదరాత్రి లాంటి మూవీస్ చూసిన తెలుగు ప్రేక్షకులు.. ఇలాంటివి మన దగ్గర ఎందుకు రావట్లేదు అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడే చాలా లెక్కలు ఆధారపడి ఉంటాయి.

సినిమా అనేది పక్కా వ్యాపారం. ప్రేక్షకులే దేవుళ్లు, వాళ్లు లేకపోతే మేం లేం అని హీరోలు, దర్శకనిర్మాతలు ఊరికే చెప్పరు. ఎందుకంటే తమ పెట్టుబడి తిరిగి రాబట్టాలంటే ఆడియెన్స్‌ని కాకా పట్టాలి. టాలీవుడ్‌లో చాలామంది నిర్మాతలు చేస్తున్నది అదే. ఉదాహరణకు రీసెంట్ టైంలో తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చిన డోరతి, బత్తా సినిమాలనే తీసుకుందాం. థియేటర్లలో రిలీజైనప్పుడు వీటికి పెద్దగా కలెక్షన్స్ రాలేదు. డబ్బులు రాని చిత్రాల్ని మన నిర్మాతలు ఎందుకు తీస్తారు? వాళ్లకేం అవసరం? సరిగ్గా ఇక్కడే తెలుగు సినిమా మార్కెట్ స్వరూపం, కమర్షియల్ లెక్కలు బయటపడతాయి.

ఎక్కువ మంది ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో సినిమాలు రూపొందించేటప్పుడు కొన్ని కమర్షియల్ అంశాలని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం నిర్మాతలకు ఉంటుంది. ప్రేక్షకుల అభిరుచులు, హీరోల ఇమేజ్, సినిమా మార్కెట్, పెట్టుబడులు, బాక్సాఫీస్ అంచనాలు వంటి అంశాలన్నీ సినిమాకు వచ్చే ఆదాయంపై ప్రభావం చూపిస్తాయి. అందుకే ప్రతి దర్శకుడికి తనదైన శైలిలో సినిమా తెరకెక్కించే స్వేచ్ఛ ఉన్నప్పటికీ, భారీ బడ్జెట్‌తో, భారీ అంచనాల మధ్య రూపొందే సినిమాల్లో కొన్ని కమర్షియల్ అంశాలను పక్కన పెట్టడం సాధ్యం కాదు. అందుకే హీరోల దగ్గర నుంచి దర్శకనిర్మాతల వరకు ఎవరూ సాహసం చేయలేకపోతున్నారు.

(ఇదీ చదవండి: సమస్య ప్రేక్షకుల దగ్గరే ఉంది.. టాలీవుడ్ నిర్మాత)

తెలుగు సినిమాకు వైవిధ్యం అవసరమే. కొత్త కథలు, కొత్త కథనాలు, హీరోలను భిన్నంగా చూపించే ప్రయత్నాలు జరగాలి. అయితే పొరుగు భాషల్లో వచ్చిన ప్రతి హిట్ సినిమాని తీసుకుని టాలీవుడ్‌ని టార్గెట్ చేయడం కంటే టాలీవుడ్ మార్కెట్, ఇక్కడి ప్రేక్షకుల అంచనాలు, నిర్మాతలు పెట్టే పెట్టుబడులు లాంటి అంశాలను కూడా ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

అయితే పాన్ ఇండియా మోజులో పడిపోయి మన హీరోలు.. మంచి సినిమాలు తీయడం మానేశారు. మాస్ సినిమాలు సూట్ అవ్వకపోయినా, రికార్డులు కోసం కృత్రిమంగా కమర్షియల్ అంశాల్ని ఇరికించి తీసేస్తున్నారు. అవి ఏమో సరిగ్గా వర్కౌట్ అవట్లేదు. ఈ ఏడాది అలా చాలా చిత్రాలు.. ప్రేక్షకులకు చిరాకు తెప్పించాయి. భారీతనం కంటే మనసుకు హత్తుకునే సినిమాలు తీస్తే అవే గొప్పవి అవుతాయి. దర్శకనిర్మాతలు-హీరోలు ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో?

(ఇదీ చదవండి: హీరో నిఖిల్ ఏమయ్యాడు? 'స్వయంభు' రిలీజ్ ఎప్పుడు?)

Videos

గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు

మా వాళ్లను బయటకు గెంటి.. ఆ నా కొడుకులు దొంగ ఓట్లు గుద్దుకుంటుంటే చూస్తున్నావా?

YSRCP గెలుపు తట్టుకోలేక మంత్రి సవిత అనుచరుల వీరంగం

ZPTC, MPTC ఎన్నికల్లో సత్తా చాటిన YSRCP.. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఘన విజయం

మొండిగా పోరాటం చేశాం.. దాని ఫలితమే ఈ ZPTC విజయం

గన్నవరంలో YSRCP 63 ఓట్ల మెజారిటీతో గెలుపు!

జైలర్ 2 కొత్త డేట్.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

తగ్గని బంగారం క్రేజ్... ఒక్క రోజే రూ. 60 వేల కోట్ల కొనుగోళ్లు

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

తిరుపతిలో YSRCP గెలుపు...

Photos

+5

సందడే.. సందడి.. వెలుగుల ముంగిళ్లు (ఫోటోలు)

+5

దివాళి వేళ.. మెరిసిన శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)

+5

సంపూ 'కొబ్బరిమట్ట' రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

'రామాయణ'లో మండోదరి పాత్ర.. కాజల్ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)

+5

అదరగొట్టేస్తున్న అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా! (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ జోడీ (ఫొటోలు)

+5

ధనుష్ 'ఓం' సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

మనీష్‌ మల్హోత్రా ‘ప్రీ దివాలీ సెలబ్రేషన్స్‌’...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)