Breaking News

Israel-Iran: అణుయుద్ధం.. నిజమెంత?

Published on Mon, 06/23/2025 - 10:17

ఇజ్రాయెల్‌ - ఇరాన్‌ యుద్ధం రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఇరాన్‌ అణుస్థావరాలపై అమెరికా మెరుపుదాడులతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తాజాగా.. సోమవారం తెల్లవారుజామున ఇరాన్‌ అర గంట వ్యవధిలోనే ఇజ్రాయెల్‌పై 22 క్షిపణులతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చాలామంది మనసుల్లో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే.. ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? అని!. ఈ ప్రశ్నకు సమాధానం అంత తేలిక కాదు. చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అవేంటో.. ఒక్కటొక్కటిగా చూద్దాం.

1.ఇజ్రాయెల్‌- ఇరాన్‌ యుద్ధం మొదలైనప్పటి నుంచి దౌత్యవర్గాల్లో అణుయుద్ధంపై చర్చ జరుగుతూనే ఉంది. దశాబ్దాల తరువాత మధ్యప్రాచ్య పరిస్థితులు అణుయుద్ధానికి దారితీసేలా ఉన్నాయన్న వ్యాఖ్యలూ వినపిస్తున్నాయి. అయితే ఆ దారుణం జరక్కుండా చూసేందుకు ప్రభుత్వాధినేతలు చాలామంది తమవంతు ప్రయత్నాలూ చేస్తున్నారు. 

2.‘‘అణుస్థావరాలపై అమెరికా దాడి యుద్ధం ప్రకటించడమే!’’ అని ఇరాన్‌ చెప్పడమే కాకుండా.. అణ్వాయుధాలకు సంబంధించిన అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం నుంచి వైదొలగే ఆలోచన కూడా చేస్తోంది. 1970 నుంచి అమల్లో ఉన్న ఈ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం నుంచి వైదొలగడం అంటే.. ఇరాన్‌ తనకు నచ్చినట్టుగా అణు ఇంధనాన్ని శుద్ధి చేసుకోగలదు. అణ్వాస్త్రాలూ తయారు చేసుకోగలదు. ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) వంటి ఐరాస సంస్థల పర్యవేక్షణను అనుమతించదన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇరాన్‌ మరింత వేగంగా అణ్వాయుధాలను తయారు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.

3. ఇదిలా ఉంటే ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఏ దేశం ఎటువైపున ఉన్నదన్నది కూడా అణుదాడులు జరిగే అవకాశాలను నిర్ణయిస్తుంది. ఇరాన్‌పై అమెరికా దాడులను రష్యా, చైనా తీవ్రంగా ఖండించాయి. అయితే ప్రస్తుతానికి ఈ రెండు దేశాలూ ఇరాన్‌కు నేరుగా మిలటరీ సాయం చేసే స్థితికి చేరలేదు. టర్కీ, ఖతార్‌, సౌదీ అరేబియాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మరోవైపు భారత్‌సహా అనేక ఆసియా దేశాలు ఇరు పక్షాలకూ దూరంగా ఉంటున్నాయి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఇరుదేశాలకు సూచిస్తున్నాయి. 

4. అమెరికా నిన్న ఇరాన్‌ అణు స్థావరాలపై బంకర్‌ బాంబులతో విరుచుకుపడ్డ నేపథ్యంలో ఐఏఈఏ ఒక హెచ్చరిక చేసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇరాన్‌-ఇజ్రాయెల్‌ ప్రాంతంలో రేడియోధార్మిక ప్రభావం పెరిగిపోవడం ఖాయమని స్పష్టం చేసింది. ఫోర్డో, నటాన్జ్‌, ఇస్‌ఫహాన్‌లలోని అణుస్థావరాలను తాము ధ్వంసం చేసినట్లు అమెరికా ‍ప్రకటించినప్పటికీ ఆ ప్రాంతాల్లో రేడియోధార్మిక పదార్థాలేవీ లేవని ఇరాన్‌ ప్రకటించడం కొంత ఊరటనిచ్చే అంశం. సరిగ్గా దాడులు జరిగే ముందే ఇరాన్‌ ఫర్డో స్థావరం నుంచి సుమారు 400 కిలోల యురేనియం (60 శాతం శుద్ధత కలిగినది. ఆయుధాల తయారీకి కనీసం 90 శాతం శుద్ధమైన యురేనియం 235 అవసరం.)ను అక్కడి నుంచి తరలించినట్లు వార్తలొచ్చాయి. 

ఇంకోపక్క ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ఇజ్రాయెల్‌ తన వైఖరిని సమర్థించుకోగా.. వాటిని సార్వభౌమత్వంపై దాడులుగా ఇరాన్‌ అభివర్ణించింది. 

మొత్తమ్మీద చూస్తే ప్రపంచం అణుయుద్ధపు అంచుల్లో ఉందని చెప్పలేము. ఇప్పటివరకూ యుద్ధం ఇజ్రాయెల్‌, ఇరాన్‌, అమెరికాలకే పరిమితమై ఉంది. మధ్యప్రాచ్య దేశాలు, రష్యా, చైనా వంటి అభివృద్ది చెందిన దేశాలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇందులో మార్పు లేనంత వరకూ అణుయుద్ధం జరిగే అవకాశం తక్కువే!. 

:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా!

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)