24 గంటలే టైమ్ లేదా పార్టీకి రాజీ'నామాలే' | Tanuku tdp supporters takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

24 గంటలే టైమ్ లేదా పార్టీకి రాజీ'నామాలే'

Apr 28 2015 1:53 PM | Updated on Aug 10 2018 6:49 PM

24 గంటలే టైమ్ లేదా పార్టీకి రాజీ'నామాలే' - Sakshi

24 గంటలే టైమ్ లేదా పార్టీకి రాజీ'నామాలే'

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణ టీడీపీని ముసలం ముసురు కమ్మింది.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణ టీడీపీని ముసలం ముసురు కమ్మింది. చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన టీటీడీ బోర్డు సభ్యుల జాబితాలో పట్టణ మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా పేరు మాయమైంది. అది ఘోర అవమానంగా భావించిన రాజా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆ విషయం తెలిసిన పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

టీటీడీ బోర్డులో పదవి ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకోవడం ఏమిటని కార్యకర్తలు చంద్రబాబు తీరును ప్రశ్నిస్తున్నారు.  24 గంటల్లో తమ నాయకుడు వైటీ రాజాకు టీటీడీలో చోటు దక్కకుంటే తామంతా ముకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను మంగళవారం కలసి 32 మంది టీడీపీ కౌన్సిలర్లు అల్టిమేటం ఇచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement