టీమిండియా ‘ప్రపంచ’ రికార్డు.. పాకిస్తాన్‌తో సమంగా

Published on Mon, 03/02/2026 - 10:17

వెస్టిండీస్‌తో సూపర్‌-8 మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. ఐదు వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత జట్టు సమం చేసింది.

సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడి
శ్రీలంకతో కలిసి వరల్డ్‌కప్‌ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌.. లీగ్‌ దశలో అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, సూపర్‌-8 దశలో తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

వరుస విజయాలతో సెమీస్‌కు
అయితే, తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వే (IND vs ZIM)ను భారీ తేడాతో ఓడించి సెమీ ఫైనల్‌ రేసులో ముందుకు వచ్చిన భారత్‌.. ఆదివారం నాటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ (IND vs WI)ను చిత్తు చేసి బెర్తును ఖరారు చేసుకుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు సాధించింది.

విండీస్‌ బ్యాటర్లలో రోవ్‌మన్‌ పావెల్‌ (19 బంతుల్లో 34), జేసన్‌ హోల్డర్‌ (22 బంతుల్లో 37) అజేయ ఇన్నింగ్స్‌తో అలరించగా.. ఓపెనర్‌ రోస్టన్‌ ఛేజ్‌ (25 బంతుల్లో 40) టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్‌ పాండ్యా, వరుణ్‌ చక్రవర్తి చెరో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

సంజూ స్పెషల్‌
ఇక లక్ష్య ఛేదనలో భారత్‌ ఆరంభంలో తడబడినా ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson) జట్టును విజయతీరాలకు చేర్చాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 97 పరుగులతో అజేయంగా నిలిచి గెలుపును ఖరారు చేశాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్‌ సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది.

పాక్‌ ప్రపంచ రికార్డు సమం
కాగా టీమిండియా టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో సెమీస్‌ చేరడం ఇది ఆరోసారి. తద్వారా పాకిస్తాన్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్‌ సమం చేసింది. ఇక ఇదే ఎడిషన్‌లో అందరి కంటే ముందే సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకున్న ఇంగ్లండ్‌ సైతం ఆరోసారి సెమీ ఫైనల్లో అడుగుపెట్టి.. పాక్‌, భారత్‌ సరసన నిలిచింది. ఇక గురువారం నాటిమ్యాచ్‌లో ఫైనల్‌ బెర్తు కోసం టీమిండియా ఇంగ్లండ్‌ మధ్యమ్యాచ్‌ జరుగుతుంది. ఇందుకు ముంబై వేదిక.

టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో అత్యధికసార్లు సెమీ ఫైనల్‌ చేరిన జట్లు ఇవే
👉పాకిస్తాన్‌- ఆరుసార్లు (2007, 2009, 2010, 2012, 2021, 2022)
👉టీమిండియా- ఆరుసార్లు (2007, 2014, 2016, 2022, 2024, 2026)
👉ఇంగ్లండ్‌- ఆరుసార్లు (2010, 2016, 2021, 2022, 2024, 2026

చదవండి: ఇది సరిపోతుందా బాస్‌!.. విమర్శలకు సంజూ ’స్టైల్‌’ కౌంటర్‌

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)