Breaking News

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, సీజేఐకి ఎంపీ గురుమూర్తి లేఖ

Published on Mon, 09/22/2025 - 21:11

ఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయికి వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. తిరుమల పరకామణి వివాదంపై సీబీఐతో దర్యాప్తు జరపాలని అమిత్ షాను గురుమూర్తి కోరారు. పరకామణి వివాదంపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయికి విజ్ఞప్తి చేశారు.

‘‘పరకామణి వివాదానికి ఏపీ సర్కార్‌ రాజకీయ రంగు పులుముతోంది. వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలతో ఆటలాడుతోంది. 100 కోట్ల హిందువుల విశ్వాసాలతో చెలగాటమాడటం దారుణం. వివాదంపై పారదర్శక, నిష్పక్షపాత దర్యాప్తు అవసరం. మతాన్ని  రాజకీయాల కోసం వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధం. ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. జ్యూడిషియల్ విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలి’’ అని సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో గురుమూర్తి పేర్కొన్నారు.

‘‘రాజకీయ ప్రతీకారం కోసం తిరుమల పరకామణి వివాదాన్ని టీడీపీ ప్రభుత్వం వాడుకుంటుంది. ఏపీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోంది. దేవాలయ ప్రతిష్టను మంటగలిపేందుకు విమర్శలు చేస్తున్నారు. భక్తుల విశ్వాసాలతో ఆటలాడుతున్నారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలి. నిష్పక్షపాత పారదర్శక విచారణతోనే సత్యం బయటపడుతుంది. రాజకీయ దురుద్దేశాలకు చెక్ పడుతుంది. ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు జరిపి భక్తుల విశ్వాసాలను కాపాడాలి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో గురుమూర్తి విజ్ఞప్తి చేశారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)