అమాయక ప్రజలను బాబు మోసం చేశారు: మల్లాది విష్ణు

Published on Mon, 06/02/2025 - 13:48

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, రౌడీలు.. పోలీసుల రాజ్యమే నడుస్తోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సోమవారం వెన్నుపోటు దినం (Vennupotu Dinam) నిరసన పోస్టర్ ఆవిష్కరణ జరిపి ఆయన మాట్లాడారు. 

‘‘ప్రజలకు హామీ ఇచ్చి చంద్రబాబు వెన్నుపోటు(Chandrababu Vennupotu) పొడిచారు. అందుకే జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిరసన చేపడతాం. ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి నష్టపోయారు. రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన దోపిడీతో మొదలైంది. సూపర్ సిక్స్ రాష్ట్రంలో ఫెయిల్యూర్ అయ్యింది. ఆస్తి పన్ను, కరెంటు చార్జీలు కూటమి ప్రభుత్వం విపరీతంగా పెంచింది..  

.. చంద్రబాబు ఎన్నికల ముందు ఒక మాట.. ఎన్నికల తర్వాత ఒక మాట చెబుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే సచివాలయాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలో ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అమలు జరగట్లేదు. రేషన్ డోర్ డెలివరీ(Ration Door Delivery System) విధానాన్ని కూడా చంద్రబాబు తొలగించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం దారుణం. 

.. ఉచిత బస్సు, అమ్మకి వందనం అంటూ ప్రజలను మోసం చేశారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. రౌడీరాజ్యం , పోలీసు రాజ్యం నడుస్తోంది. విజయవాడలో శాతవాహన కళాశాల 5 ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం కబ్జా చేయడానికి చూస్తోంది. శాతవాహన కళాశాల ప్రిన్సిపల్‌ను కిడ్నాప్ చేయడం దారుణం. అసలు బెజవాడ నగరంలో శాంతి భద్రతలు ఉన్నాయా?. చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల విజయవాడ నగరంలో బుడమేరు వరదల్లో 12 డివిజన్లు నీట మునిగాయి అని  మల్లాది విష్ణు మండిపడ్డారు. 

విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి(Vijayawada Deputy Mayor Sailaja Reddy) మాట్లాడుతూ.. ‘‘జగన్‌ను ఒంటరిగా ఢీ కొనలేక మూడు పార్టీలు ముందుకు వచ్చాయి. చంద్రబాబు అమాయక ప్రజలను మోసం చేశారు. కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలంలో ఒక్క హామీ అమలు చేయలేదు. టీడీపీ మహానాడుతో ప్రజలకు ఏం ఉపయోగం లేదు. జగన్‌ను తిట్టేందుకు.. లోకేష్ ను పొగడ్తలతో ముంచేందుకే మహానాడు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు లేకుండా చేస్తున్నారు అని అన్నారామె. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: అలాంటి వారిని ఇలాగే శిక్షస్తారా?.. మేడమ్‌!

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)