Breaking News

తనూజను వదిలేశానన్న కల్యాణ్‌.. సంజనాను ముంచేశారు!

Published on Wed, 10/22/2025 - 11:33

నామినేషన్స్‌ అయిపోయినా కంటెస్టెంట్ల కోపతాపాలు మాత్రం తగ్గలేదు. సంజనా.. కల్యాణ్‌పై, తనూజ.. ఇమ్మాన్యుయేల్‌పై బుసలు కొడుతూనే ఉన్నారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో అక్టోబర్‌ 21వ ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..

నామినేషన్స్‌ లొల్లి
తనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్‌ చేస్తా.. ఈ మాట అన్నందుకే నామినేషన్‌ చేసే పవర్‌ను కల్యాణ్‌కు ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్‌. కట్‌ చేస్తే అది ఇమ్మూ మెడకే చుట్టుకుంది. అతడు తనూజకు బదులుగా ఇమ్మూ తల్లి సంజనాను నామినేట్‌ చేశాడు. నమ్మించి మోసం చేశాడంటూ ఇమ్మూ గొడవపడ్డాడు. రమ్య ఆల్‌రెడీ తనూజను నామినేట్‌ చేసింది. నాకు ఒక్క పాయింట్‌ కూడా మిగల్చలేదు అని కల్యాణ్‌ వివరణ ఇచ్చాడు.

తనూజను ఎప్పుడో వదిలేశా!
అప్పటికీ అసహనంతో ఊగిపోతున్న ఇమ్మూ (Emmanuel).. సరే, ఈ వారం గమనించు, తను జెన్యూన్‌గా ఉందో, లేదో! అని తనూజ గురించి అన్నాడు. అందుకు కల్యాణ్‌ ఇచ్చిన ఆన్సర్‌కు దిమ్మ తిరగాల్సిందే! నేను ఎప్పుడో వదిలేశా అన్నా.. తన(తనూజ)ను పట్టించుకోవట్లేదు! అన్నాడు. ఈ వారం కూడా తను సేఫ్‌ గేమ్‌ ఆడితే తర్వాతి వారం నామినేట్‌ చేస్తానని మాధురితో చెప్పాడు కల్యాణ్‌.

ఇమ్మాన్యుయేల్‌పై రంకెలేసిన తనూజ
మరోవైపు తనూజ.. అరుస్తూనే ఉంది. తల్లీ కొడుకులైన సంజనా, ఇమ్మాన్యుయేల్‌పై చిందులు తొక్కింది. తనూజను బుజ్జగించబోతే మాధురిపైనా అరిచేయడం గమనార్హం! ఆయేషా.. గౌరవ్‌తో రాత్రిపూట ముచ్చట్లాడింది. రమ్య హౌస్‌లోకి వచ్చేటప్పుడే తనూజను ఎలిమినేట్‌ చేయాలని బలంగా డిసైడ్‌ అయింది. ఆమె ఎలిమినేట్‌ అయ్యేవరకు నామినేట్‌ చేస్తూనే ఉంటానంది. తన ఫోకస్‌ అంతా ఒక్కదగ్గరే ఉందని అభిప్రాయపడింది.

దొంగలుగా హౌస్‌మేట్స్‌
బిగ్‌బాస్‌ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్‌షిప్‌ కోసం ఓ వెరైటీ టాస్క్‌ ఇచ్చాడు. అందులో భాగంగా మాస్‌ మాధురి, సంజనా సైలెన్సర్‌ అంటూ టీమ్‌ లీడర్స్‌ను ప్రకటించాడు. గేమ్స్‌ ముగిసే సమయానికి ఎవరి గ్యాంగ్‌లో ఎక్కువమంది ఉంటే వారు కంటెండర్స్‌ అవుతారన్నాడు. మొదటి గేమ్‌లో మాధురి టీమ్‌ గెలిచింది. ఓడిపోయిన సంజనాను స్విమ్మింగ్‌ పూల్‌లో ముంచేశారు.

చదవండి: టాప్‌ హీరోకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)