Breaking News

నువ్వు ఇంటికెళ్లిపో.. తనూజ, సుమన్ శెట్టి ఇలా షాకిచ్చారేంటి?

Published on Tue, 12/02/2025 - 09:47

బిగ్‌బాస్ 9 హౌస్‌లో విజయవంతంగా 12 వారాలు పూర్తయ్యాయి. ఆదివారం ఎపిసోడ్‌లో దివ్య ఎలిమినేట్ అయి బయటకెళ్లిపోవడం చాలామంది ఊహించిందే. మరకొరు కూడా ఎలిమినేట్ అవుతారేమో అనుకున్నారు కానీ అలా జరగలేదు. ఇకపోతే 13వ వారానికిగానూ సోమవారం నామినేషన్స్ ప్రక్రియ చిత్రవిచిత్రంగా జరిగింది. అటు సుమన్ శెట్టి, ఇటు తనూజ.. డీమన్‌కి చిన్నపాటి షాక్‌లు ఇచ్చారు. ఇంతకీ సోమవారం ఎపిసోడ్‌లో ఏమేం జరిగింది? నామినేషన్స్‌లో ఎవరెవరున్నారు?

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన రష్మిక హారర్ సినిమా)

ప్రతి సభ్యులు ఇద్దరి సభ్యులకు చెందిన బాటిల్స్ పగలగొట్టి నామినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. తొలుత ఇమ్మాన్యూయేల్.. రీతూ, పవన్ పేర్లు చెప్పాడు. భరణి వచ్చి.. తన మెడిసన్స్‌తో ప్రాంక్ చేయడం నచ్చలేదని సంజనని, గతవారం సరిగా కనిపించలేదు అని పవన్‌ని నామినేట్ చేశాడు. రీతూ.. సుమన్, సంజనాని నామినేట్ చేసింది. తనూజ అయితే పవన్ పేరు చెప్పింది. కానీ ఈ డ్రామా కాస్త విచిత్రంగా నడిచింది.

తనూజ.. తొలుత ఇమ్మూని నామినేట్ చేస్తున్నట్లు చాలాసేపు మాట్లాడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిసారి నన్ను నామినేషన్‌లోకి లాగాడు. ఏదో మాట అన్నంత మాత్రాన ఫ్రెండ్‌ని విసిరి పారేశాం అని కాదు. ఇప్పటికీ నువ్వు నా ఫ్రెండ్ వే. ఏదన్నా ఉంటే  ముఖం మీద చెప్పు అని అడిగింది. దీనికి ఇమ్మూ తనవైపు నుంచి సమాధానం ఇచ్చాడు. దీంతో ఇద్దరూ తమ మధ్య దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు సడన్‌గా డీమన్ పవన్ పేరు చెప్పి తనూజ షాకిచ్చింది. ఇప్పటివరకు నామినేషన్ పాయింట్ చెప్పి మారిస్తే జోక్‌లా అనిపించిందని పవన్ ఆశ్చర్యపోయాడు. అలానే సంజనని కూడా నామినేట్ చేసింది.

(ఇదీ చదవండి:  సమంతకు ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం అయిపోయిందా?)

సుమన్ శెట్టి చేసిన నామినేషన్స్ అయితే వేరే లెవల్ కామెడీ అని చెప్పొచ్చు. నువ్వు హౌస్‌లో గట్టి గట్టిగా అరుస్తావ్, నాకు అది డిస్ట్రబెన్స్‌గా ఉందని చెప్పి రీతూని నామినేట్ చేశాడు. దీంతో రీతూ షాకయింది. మిగిలిన వాళ్లకు కూడా ఇబ్బందయితే వాళ్లు చెప్పుండేవాళ్లు కదా అని రీతూ అడిగితే.. వాళ్లకు భయమేమో చెప్పలేదు, నాకు భయం లేదు చెప్తున్నా అని వివరణ ఇచ్చాడు. తర్వాత డీమన్ పవన్ పేరు చెబుతూ.. నీకు దెబ్బ తగిలింది కదా, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ కూడా, మాకంటే నువ్వే స్ట్రాంగ్ గనుక ఇంటికెళ్లిపోయి రెస్ట్ తీసుకో అని కారణం చెప్పాడు. దీనికి ఏమనలో తెలీక పవన్ నవ్వుకున్నాడు.

ఇక సంజన.. పవన్, రీతూని నామినేట్ చేసింది. డీమన్ పవన్.. తొలుత ఇమ్మూ పేరు చెప్పి కాస్త నవ్వించి తర్వాత సంజన, తనూజ పేర్లు చెప్పాడు. చివరగా కెప్టెన్ కల్యాణ్.. భరణిని నామినేట్ చేశాడు. అలా ఈ వారం మొత్తంగా ఆరుగురు నామినేషన్లలో నిలిచారు. వారిలో సంజన, రీతూ, భరణి, పవన్, తనూజ, సుమన్ ఉన్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)