సాక్షి సాక్షిగా.. నాగార్జునకు ఇచ్చే వెళ్తా..!
Breaking News
రాము ఔట్.. ఇమ్మూ స్వార్థం! టాప్ 6 వీళ్లే..!
Published on Sun, 11/09/2025 - 09:18
పచ్చని పల్లెటూరులో బతికే గంగవ్వకు ఏసీ వాతావరణం పడక, హౌస్‌లో ఉండలేక రెండుసార్లు (తెలుగు బిగ్‌బాస్ 4, 8వ సీజన్స్‌లో) సెల్ఫ్ ఎలిమినేట్ అయింది. ఇప్పుడదే రకంగా రాము రాథోడ్ కూడా తనంతట తానే బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఆరోగ్యం సహకరించక కాదు, ఇంటి మీద బెంగతో! నాగార్జున సర్దిచెప్పినా సరే వినకుండా బయటకు వచ్చేశాడు. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శనివారం (నవంబర్ 8వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
టాప్ 6లో ఎవరంటే?
నాగార్జున, అమల, రామ్‌గోపాల్ వర్మల 'శివ' మూవీ ప్రమోషన్స్‌తో ఎపిసోడ్ మొదలైంది. తర్వాత.. కంటెస్టెంట్లు ఎవరు హిట్టు? ఎవరు ఫ్లాప్? అని ఆడియన్స్‌తో ఓటింగ్ వేయించారు. అందులో సుమన్, ఇమ్మాన్యుయేల్ (Emmanuel), తనూజ, కల్యాణ్, రీతూ, పవన్ టాప్ 6లో ఉన్నారు. వీరికి నాగ్ కొన్ని బంపరాఫర్స్ ఇస్తూనే కొన్ని కండీషన్స్ పెట్టాడు. వారి కోరికలు నెరవేర్చుకోవాలంటే కొందరు త్యాగాలు చేయాల్సి ఉంటుందన్నాడు.

ఇమ్మూ స్వార్థం
భరణి ఫ్యామిలీ వీక్ త్యాగం చేస్తే సుమన్ కెప్టెన్సీ కంటెండర్ అవుతాడని తెలిపాడు. దీన్ని సుమన్ తిరస్కరించి కెప్టెన్సీ కంటెండర్‌షిప్ ఆడి గెల్చుకుంటానన్నాడు. ఇమ్మాన్యుయేల్‌కు గర్ల్‌ఫ్రెండ్ వాయిస్ మెసేజ్ వచ్చిందని, అది వినాలంటే గౌరవ్‌కు బిగ్‌బాస్ ఇచ్చిన పవర్ పోతుందన్నాడు. ఆ పవర్ పోతే పోనీయ్.. అని భావించిన ఇమ్మూ.. ప్రియురాలి సందేశం విని ఎమోషనలయ్యాడు. తనూజ సోదరి వాయిస్ మెసేజ్ వినాలంటే కల్యాణ్ సీజన్ మొత్తం నామినేట్ అవాలన్నాడు.
రీతూకి రెండు సర్‌ప్రైజ్‌లు
రెండువారాల్లో సోదరి పెళ్లి ఉందని ఎమోషనలైన తనూజ.. తన కోసం కల్యాణ్‌ను బలి చేసేందుకు ఒప్పుకోలేదు. కల్యాణ్‌కు వారంపాటు చికెన్, మటన్ కావాలంటే నిఖిల్ రెండు వారాలు నామినేట్ అవ్వాలన్నాడు. దీన్ని కల్యాణ్ తిరస్కరించాడు. రీతూ.. తండ్రి షర్ట్ పొందడం కోసం సంజనా చీరల్ని కోల్పోయింది. పవన్.. ఫ్యామిలీ ఫోటో కావాలంటే రీతూకి తండ్రి ఫోటో రాదన్నాడు. దీంతో అతడు తన ఫ్యామిలీ ఫోటో త్యాగం చేసి రీతూకి ఆమె తండ్రి ఫోటో వచ్చేలా చేశాడు.

రాను బిగ్‌బాస్‌కు రానంటూ..
ఇంటిమీద బెంగ పెట్టుకున్న రాము (Ramu Rathod)ను నాగ్ కదిలించగానే.. అతడు పాట రూపంలో తన బాధనంతా బయటపెట్టాడు. బయటకు వెళ్లిపోతానన్నాడు. హీరోలు ఆట అంతు చూస్తారు, కానీ మధ్యలో వదిలేయరు అని నాగ్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా రాము వినిపించుకోలేదు. క్షమించండి సార్, వెళ్లిపోతాను అని పదేపదే అదే మాట అన్నాడు. వెళ్లిపోవాలనుకుంటే గేట్లు ఓపెన్ చేస్తా.. 10 సెకన్లలో నిర్ణయం చెప్పమంటూ టైమిచ్చినా.. వెళ్లిపోయేందుకే మొగ్గుచూపాడు. హౌస్‌మేట్స్ ఆపేందుకు ప్రయత్నించినా లెక్కచేయలేదు. అలా రాము స్వతాహాగా హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇది సడన్ ఎలిమినేషన్ కావడంతో అతడి జర్నీ వీడియో చూడకుండానే వెళ్లిపోయాడు.
చదవండి: 'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే..
Tags : 1