భారతీయులుగా చెప్పుకునేందుకు సిగ్గుపడ్డారు | Twitter outrage against PM Modi for saying Indians were ashamed till a year ago | Sakshi
Sakshi News home page

భారతీయులుగా చెప్పుకునేందుకు సిగ్గుపడ్డారు

May 19 2015 5:24 PM | Updated on Aug 15 2018 6:34 PM

భారతీయులుగా చెప్పుకునేందుకు సిగ్గుపడ్డారు - Sakshi

భారతీయులుగా చెప్పుకునేందుకు సిగ్గుపడ్డారు

ప్రధాని నరేంద్రమోదీ వివాదంలో చిక్కుకున్నారు. తాము అధికారంలోకి రాకముందు భారత్లో జన్మించినవారిగా చెప్పుకునేందుకు సిగ్గుపడ్డారని చైనా, దక్షిణ కొరియా పర్యటన నేపథ్యంలో ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని సృష్టించాయి.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ వివాదంలో చిక్కుకున్నారు. తాము అధికారంలోకి రాకముందు భారత్లో జన్మించినవారిగా చెప్పుకునేందుకు సిగ్గుపడ్డారని చైనా, దక్షిణ కొరియా పర్యటన నేపథ్యంలో ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని సృష్టించాయి. 'ఏడాది కిందట మీరంతా భారతదేశంలో జన్మించినవారిగా చెప్పుకునేందుకు సిగ్గుపడేవారు. కానీ మా పరిపాలన వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు భారతదేశ ప్రతినిధులమని చెప్పుకునేందుకు గర్వపడుతున్నారు' అని మోదీ ట్విట్ చేశారు.

దీనిపై కాంగ్రెస్ స్పందించింది. మోదీ ఆయన స్థాయిని దిగజార్చుకుంటున్నారని పేర్కొంది. చెత్తరాజకీయాలకు పాల్పడకుండా ప్రధాని హోదాకున్న గౌరవాన్ని కాపాడాలని సూచించారు. అలాగే చాలామంది కూడా మోదీ ట్వీట్ పై విమర్శలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మొదటి ప్రధాని నరేంద్రమోదీనే అనుకుంటా అంటూ పలువురు పెదవి విరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement