తప్పులో కాలేసిన అనుష్క | Anushka Sharma gets Kalam's name wrong in tribute | Sakshi
Sakshi News home page

తప్పులో కాలేసిన అనుష్క

Jul 28 2015 7:33 PM | Updated on Aug 20 2018 3:02 PM

తప్పులో కాలేసిన అనుష్క - Sakshi

తప్పులో కాలేసిన అనుష్క

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తప్పులో కాలేసి సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచింది.

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తప్పులో కాలేసి సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచింది. సోమవారం కన్నుమూసిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరును ట్విటర్ లో తప్పుగా రాసి ఆమె విమర్శల పాలయింది. వరుసగా రెండుసార్లు తప్పు రాసింది.  'ఏబీజే కలాం ఆజాద్ మరణవార్త నాకు ఎంతో బాధ కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేసింది.

తర్వాత తప్పు తెలుసుకుని ఆ ట్వీట్ తొలగించింది. ఈసారి కూడా 'ఏపీజే కలాం ఆజాద్' అని తప్పుగా రాసింది. చివరకు మూడోసారి ఆయన పేరును సరిగా రాసింది. దేశం గర్విందగ్గ అబ్దుల్ కలాం పేరును తప్పుగా రాసిన అనుష్క శర్మపై నెటిజన్లు సైటర్లు పేల్చారు.

'మూడుసార్లు ప్రయత్నించి కలాం పేరు కరెక్ట్ గా రాసినందుకు అనుష్కకు అభినందనలు. ఇదో గొప్ప విజయం' అని ఒకరు కామెంట్ చేశారు. అనుష్కకు జీకే పాఠాలు అవసరమని మరొకరు పోస్ట్ చేశారు. పుస్తకాలు చదవడం ప్రారంభించాలని మరొకరు సలహాయిచ్చారు. ప్రముఖుల పేర్లు రాసేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని మరొకరు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement