తల్లా? ప్రియురాలా?... | Mother or Girlfriend - Who Do You Save in a Fire, Asks china Exam Paper | Sakshi
Sakshi News home page

తల్లా? ప్రియురాలా?...

Sep 30 2015 4:56 PM | Updated on Sep 5 2018 9:45 PM

తల్లా? ప్రియురాలా?... - Sakshi

తల్లా? ప్రియురాలా?...

తల్లా? ప్రియురాలా? ఇదేదో సినిమా టైటిల్ కాదు. న్యాయవిద్య పరీక్షలు రాస్తున్న చైనీయులకు వింత ప్రశ్న ఎదురయింది. ఎప్పుడైనా అగ్నిప్రమాదం సంభవించి అందులో మీ తల్లి, ప్రియురాలు

బీజింగ్ : తల్లా? ప్రియురాలా? ఇదేదో సినిమా టైటిల్ కాదు. న్యాయవిద్య పరీక్షలు రాస్తున్న చైనీయులకు వింత ప్రశ్న ఎదురయింది.  ఎప్పుడైనా అగ్నిప్రమాదం సంభవించి అందులో మీ తల్లి, ప్రియురాలు ఇరుక్కుంటే ఎవరిని రక్షిస్తారనే ప్రశ్న రావడంతో అభ్యర్థులు కంగుతిన్నారు. విద్యార్థి న్యాయ నిపుణుడిగా పనికి వచ్చేదీ లేనిదీ నిర్థారించడానికి జాతీయ న్యాయ పరీక్షలో ఈ ప్రశ్న చేర్చామని అధికారులు వివరణ ఇచ్చారు.

'ప్రమాద సమయంలో ఒక వ్యక్తి తన తల్లిని రక్షించగలిగే సామర్థ్యం ఉండి కూడా ప్రియురాలిని రక్షించాడు. ఇది నేరం అవుతుందా?'  అంటూ ప్రశ్న సాగింది. దీనికి రెండు ఆప్షన్స్ కూడా ఇచ్చి జవాబు ఎంపిక చేయాలని సూచించారు. తాజాగా ఆ పరీక్షల జవాబులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.  అలాంటి సందర్భాల్లో తల్లిని మాత్రమే రక్షించాలని, ప్రియురాలిని రక్షిస్తే తప్పే అవుతుందని వివరణ ఇచ్చింది.

కాగా ఈ ప్రశ్నపై సోషల్ మీడియాలో  విస్తృతంగా చర్చ జరిగింది. చైనా ప్రభుత్వ వాదనతో  కొందరు ఏకీభవించగా, మరికొందరు విభేదించారు. మరికొందరు ముందుగా తల్లినే కాపాడతానని, అయితే తన ప్రియురాలు యంగ్గా ఉండటం వల్ల ఆమె ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. మరికొందరు ...చట్టం, న్యాయం ముందు అందరూ సమానమే అని, ఇరువురు వ్యక్తులను వేర్వేరుగా చూడటం సరికాదని, తల్లిని రక్షిస్తే న్యాయం... అదే ప్రియురాలిని రక్షిస్తే అన్యాయమా? అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement