‘స్థానిక’ హక్కుల ఉద్యమనేత టి. వెంకటేశ్వరరావు

‘స్థానిక’ హక్కుల ఉద్యమనేత టి. వెంకటేశ్వరరావు

రాష్ట్రంలో స్థానిక సంస్థలకు హక్కులు, నిధు లు నేడు ఓ మోస్తరుగానైనా సమకూరుతున్నా యంటే. అందుకు రాజ్యాంగం 74వ సవరణ  పాత్ర ఉంది, ఆ హక్కులు  స్థానిక సంస్థలకు బదలాయించాలంటూ టి. వెంకటేశ్వరరావు (టీవీ) చేసిన కృషి అంతకు మించి ఉంది. బలమైన స్థానిక సంస్థలు ఉన్నప్పుడే రాష్ట్రాభి వృద్ధి సాధ్యమవుతుందని విశ్వసించిన వారిలో టీవీ ఒకరు. విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా, వైస్ చైర్మన్‌గా పని చేసిన టీవీ, ఆ నగరం  నగరపాలకసంస్థగా ఆవిర్భ వించిన తరువాత  తొలి మేయర్‌గా ఎన్నిక య్యారు.  రాష్ట్ర ప్రభుత్వ  పెత్తందారీతనం లేని, కమిషనర్ల ఆధిపత్యంలేని మున్సిపా లిటీల్లో స్వయంపాలన సాధించాలనే లక్ష్యం తో ఆయన ఉద్యమించారు.  మేయరు పదవి చేపట్టిన కొద్దిరోజులకే స్థానిక సంస్థల హక్కు లు, నిధుల కోసం నిరశన దీక్ష చేపట్టిన ఘనత ఆయనది.

 

 పురపాలక సంఘాల కోసం 1965 ఆం ధ్రప్రదేశ్ పురపాలకసంఘ చట్టం, నగరపా లక సంస్థలకు 1955 హైదరాబాద్ మునిసి పల్ కార్పొరేషన్ చట్టాలు అమలులో ఉన్నా యి. వాటిలో మౌలిక మార్పులు అవసరమ ని, మేయర్లు, చైర్‌పర్సన్లు, ప్రజాప్రతినిధు లకు సమంజసమైన అధికారాలు కల్పించా లని,  బెంగాల్ నమూనా మేయర్ ఇన్ కౌన్సి లు విధానాన్ని ప్రవేశపెట్టాలని టీవీ  పోరా టం నిర్వహించారు. దీనిలో భాగంగా 1995 జూన్ 18న రాష్ట్రంలోని మేయర్లు, చైర్మన్ల సదస్సును విజయవాడలో నిర్వహించారు. నగరపాలక సంస్థలకు ఉన్నతాధికారి ఎవరు? ఎన్నికైనా ప్రజాప్రతినిధులా? కమిషనర్లా అనే అంశంపై ఈ సదస్సు చర్చించింది.  పట్టణ, నగరాభివృద్ధి, ఇతర పాలనాంశాలలో ప్రజలు మేయర్లనే జవాబుదారీ చేసి ప్రశ్నిస్తారు. ఏ అధికారులూలేని మేయర్లు ఎలా స్పందించగ లరు? ప్రథమ పౌరునిగా సంస్థ కార్యకలా పాలపై పూర్తి అధికారం లేకుండా అభివృద్ధిని ఎలా సాధించగలుగుతారు? కమిషనర్‌కున్న అధికారాలు తగ్గించకుండా మేయర్లు ఏమి చేయగలరు?  కాబట్టి కొత్త చట్టం అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

 

  ప్రభు త్వంలో ఓ కదలిక తీసుకువచ్చారు.. టీవీ ఉద్యమం వల్లే  ఓ మోస్తరుగానైనా మేయర్లు, చైర్మన్లకు అధికారాలు వచ్చాయి. ఒక  కమి షనర్  కౌన్సిల్‌తో సంబంధంలేకుండా నిరం కుశ ధోరణితో వ్యవహరిస్తున్నందుకు  ఆయ నను ప్రభుత్వం రీకాల్ చేసేవరకూ టీవీ పోరా డారు. టీవీని కదిలే మునిసిపల్ చట్టం అని సంబోధించేవారు. టీవీ తొలితరం కమ్యూనిస్టు.  పుచ్చల పల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య, మోటూరు హను మంతరావు, వేములపల్లి శ్రీకృష్ణ వంటి సాహ చర్యంలో  ఆయన తనను తాను తీర్చిదిద్దు కున్నారు.  రహస్యజీతం గడుపుతూ1947-48 లో  అరెస్టు అయి రాజమండ్రి, కడలూరు జైళ్లలో గడిపారు. జైలు కమిటీ మేయర్‌గా మూడేళ్లు పనిచేశారు. పార్టీ విభజన అనం తరం సీపీఐ  విజయవాడ శాఖ కార్యదర్శిగా పార్టీ పటిష్టతకు  కృషిచేశారు. 

 

 రెండుసార్లు విజయవాడ మేయర్‌గా పనిచేసిన టీవీ ఆధునిక విజయవాడ రూప శిల్పిగా పేరొందారు. మురికివాడగా పేరున్న  నగరం రూపురేఖలను మార్చారు. సత్యనారా యణపురం రైల్వే ట్రాక్ తొలగించేందుకు కృషి చేశారు. ఫలితంగానే నేడు బీఆర్టీఎస్ రోడ్డును నగర ప్రజలు చూడగలిగారు. పడమట ఎన్టీ ఆర్ సర్కిల్ నుంచి పంటకాలువ రోడ్డు ఏర్పా టుచేశారు. కాలువపై బ్రిడ్జిలు నిర్మించడంలో ఆయన పాత్ర మరవలేనిది. విజయవాడ అన గానే కొండలపై కాపురాలు ఎవరికైనా గుర్తుకు వస్తాయి. కొండపై కిలోమీటర్ల ఎత్తున బూస్టర్ల ద్వారా నీటి సరఫరా, వీధి దీపాలు ఆయన పుణ్యమే. నగరంలో పార్కులు, రిక్రియేషన్ క్లబ్‌లకు కూడా నగరపాలకసంస్థ బడ్జెట్‌లో నిధులు కేటాయించడానికి ఆయన వెనకాడ లేదు. రాష్ట్రంలోనే తొలిసారి కార్పొరేషన్ భాగ స్వామ్యంతో వీధి బాలకార్మికుల కోసం ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థ ఏర్పాటు,  ఆ సం స్థ ద్వారా ఇప్పటి వరకూ 40వేల బాలకార్మి కుల జీవితాలు వెలుగులు నిండాయంటే ఏ రాజకీయ నాయకుడైనా ఇంతకంటే సాధిం చేది ఏం ఉంటుంది.  ఆయన కమ్యూనిస్టు నేత మాత్రమే కాదు, ముందు చూపున్న నేత. అందుకే అన్ని రాజకీయ పార్టీలకు అభిమాన పాత్రుడయ్యారు.

 ముత్యాల ప్రసాద్

 - (విజయవాడ మాజీ మేయర్

 టీవీ 14వ తేదీన తుది శ్వాస విడిచారు)
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top