Breaking News

జైస్వాల్‌ కీలక నిర్ణయం

Published on Tue, 10/28/2025 - 08:17

భారత టెస్ట్‌ జట్టు ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియా తరఫున ఎలాంటి కమిట్‌మెంట్స్‌ లేకపోవడంతో దేశవాలీ క్రికెట్‌ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. త్వరలో జరుగనున్న రంజీ ట్రోఫీ 2025/26 (Ranji Trophy) మూడో రౌండ్‌ మ్యాచ్‌ ఆడేందుకు సన్నద్దత వ్యక్తం చేస్తూ.. తన హోం టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు లేఖ రాశాడు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా వెల్లడించాడు.

జైస్వాల్‌ కొద్ది కాలం క్రితం తన హోం టీమ్‌ ముంబైని కాదని గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయితే తదనంత పరిణామాల్లో యూటర్న్‌ తీసుకున్నాడు. తాజాగా రాజస్తాన్‌తో జరిగబోయే మూడో రౌండ్‌ మ్యాచ్‌కు ముంబై తరఫున ఆడేందుకు అందుబాటులో ఉన్నట్లు ప్రకటించాడు.

ఈ మ్యాచ్‌ నవంబర్ 1 నుంచి జైపూర్‌లో జరుగుతుంది. ఎలైట్ గ్రూప్ D భాగంగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. ముంబై మేనేజ్‌మెంట్‌ తమను కాదని వెళ్లిపోవాలని చూసిన జైస్వాల్‌కు అవకాశం ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ అవకాశం ఇస్తే అతను ముంబై జట్టులో కీలకమవుతాడు.

జైస్వాల్‌ తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు. అయితే అక్టోబర్ 29 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌కు అతను ఎంపిక కాలేదు. దీంతో దేశీయ క్రికెట్‌ ఆడాలని నిర్ణయించుకున్నాడు.

టీమిండియా తరఫున కమిట్‌మెంట్స్‌ లేని సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్లు దేశీయ క్రికెట్‌ ఆడాలని బీసీసీఐ కండిషన్‌ పెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకే జైస్వాల్‌ కూడా రంజీ ఆడాలని నిర్ణయించుకున్నాడు. మూడో రౌండ్‌కు ముంబై జట్టును త్వరలో ప్రకటిస్తారు.

జైస్వాల్‌ గత సీజన్‌లో జమ్మూ అండ్‌ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున చివరిసారి ఆడాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కూడా పాల్గొన్నాడు. జైస్వాల్‌ తన చివరి ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ను ఈ ఏడాది ఆగస్ట్‌లో ఆడాడు. దులీప్‌ ట్రోఫీ 2025లో వెస్ట్‌ జోన్‌ తరఫున బరిలోకి దిగాడు.

రంజీ ట్రోఫీలో ఆడటం జైస్వాల్‌కు వ్యక్తిగతంగా కలిసొస్తుంది. నవంబర్ 14 నుంచి దక్షిణాఫ్రికాతో జరుగబోయే హోం సిరీస్‌కు ముందు మంచి ప్రాక్టీస్ అవుతుంది. ఆ సిరీస్‌లో భారత్‌ రెండు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జైస్వాల్‌కు టెస్ట్‌ జట్టులో చోటు పక్కా కాగా.. వన్డే, టీ20ల్లో అవకాశం లభిస్తుందో లేదో చూడాలి. సౌతాఫ్రికాతో టెస్ట్‌ మ్యాచ్‌లు నవంబర్ 14 (కోల్‌కతా), నవంబర్ 22 (గౌహతి) తేదీల్లో జరుగనున్నాయి.

చదవండి: వెస్టిండీస్‌ బోణీ

 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)