అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్‌ సిగ్నల్‌!

Published on Tue, 03/03/2026 - 15:56

ఆకిబ్‌ నబీ.. భారత క్రికెట్‌లో ఈ పేరు చర్చనీయాంశంగా మారింది. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో అతడి అత్యద్భుత ప్రదర్శనలు ఇందుకు కారణం. జమ్మూ కశ్మీర్‌ తొలిసారి రంజీ టైటిల్‌ గెలవడంలో ఈ పేస్‌ బౌలర్‌ది కీలక పాత్ర.

స్పందించిన బీసీసీఐ
సీజన్‌ ఆసాంతం అద్భుత ఆట తీరుతో జట్టును గెలిపించిన ఆకిబ్‌ నబీ (Auqib Nabi Dar)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడిని భారత టెస్టు జట్టుకు ఎంపిక చేయాలనే డిమాండ్లూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్‌ సైకియా స్పందించాడు.

అతడిదే కీలక పాత్ర
త్వరలోనే అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు. అయితే, ఆకిబ్‌ ఎంపిక విషయంలో తుది నిర్ణయం మాత్రం సెలక్టర్లదేనని స్పష్టం సైకియా చేశాడు. ‘‘అతడు అద్భుతంగా ఆడాడు. జట్టు విజయాల్లో అతడిదే కీలక పాత్ర.

క్వార్టర్‌ ఫైనల్లో ఐదు వికెట్లు తీశాడు. సెమీ ఫైనల్లోనూ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇక ఫైనల్లోనూ ఇదే ప్రదర్శన పునరావృతం చేశాడు. ఐదు వికెట్లతో సత్తా చాటి జట్టును గెలిపించాడు. అతడి బౌలింగ్‌ ఫైనల్‌ రాతను మార్చింది. కాబట్టి ప్రతి ఒక్కరి దృష్టిని అతడు ఆకర్షించగలిగాడు.

రంజీ ట్రోఫీకి సంబంధించి ప్రతి మ్యాచ్‌కు మా సెలక్టర్లు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశాము. ఫైనల్‌ సహా కీలక మ్యాచ్‌లన్నీ మా సెలక్టర్లు వీక్షించారు. వాళ్లు తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారనే అనుకుంటున్నా. ఇప్పటికే అతడు లైమ్‌లైట్‌లో ఉన్నాడు. సెలక్టర్లే అతడి విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు.

అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?
ప్రతిభ ఉన్న వాళ్లకు అన్యాయం జరగకుండా బీసీసీఐ సరైన చర్యలు తీసుకుంటుంది. మా సెలక్టర్లు అతడితో పాటు మ్యాచ్‌లో మెరుగ్గా రాణించిన అందరి ఆటను గమనించారు. నబీని వెలుగులోకి తీసుకుచ్చింది ఎవరు?.. అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. జమ్మూ కశ్మీర్‌ సెలక్టర్లే కదా!.. 

దేశీ క్రికెట్‌లో రాష్ట్ర జట్టు తరఫున అదరగొట్టిన వారికి బీసీసీఐ సెలక్టర్లు కచ్చితంగా అవకాశం ఇస్తారు’’ అని దేవజిత్‌ సైకియా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో పేర్కొన్నాడు.

60 వికెట్లు కూల్చాడు
కాగా కర్ణాటకతో ఫైనల్లో జమ్మూ కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆకిబ్‌ నబీ ఐదు వికెట్లతో రాణించి.. కర్ణాటక బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో విజేతగా అవతరించింది. 

తాజా రంజీ సీజన్‌లో 29 ఏళ్ల కుడిచేతి వాటం పేసర్‌ ఏకంగా 60 వికెట్లు కూల్చాడు. ఇందులో ఎనిమిది ఫైవ్‌ వికెట్లు హాల్స్‌ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలోనే ఆకిబి నబీ అరంగేట్రానికి డిమాండ్లు పెరుగుతున్నాయి. 

చదవండి: ప్రపంచకప్‌ వైఫల్యాల తర్వాత కూడా బాబర్‌ ఆజమ్‌కు కెప్టెన్సీ పగ్గాలు

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)