రిషభ్‌ పంత్‌ ఫెయిల్‌.. ఇలా అయితే కష్టమే!

Published on Thu, 01/01/2026 - 09:10

టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ మరోసారి పేలవ ఆట తీరుతో నిరాశపరిచాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో... మెరుగైన ప్రదర్శన చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తాడనుకున్న ఈ వికెట్‌ కీపర్‌.. అంచనాలు అందుకోలేకపోతున్నాడు.

దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు సారథ్యం వహిస్తున్న పంత్‌ (Rishabh Pant)... కీలక పోరులో బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 79 పరుగుల తేడాతో ఒడిశా (Delhi Vs Odisha) చేతిలో ఓడింది. 

సమంత్రాయ్‌ హాఫ్‌ సెంచరీ
మొదట బ్యాటింగ్‌ చేసిన ఒడిశా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కెప్టెన్‌, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బిప్లబ్‌ సమంత్రాయ్‌ (72; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), హాఫ్‌ సెంచరీ సాధించగా... తక్కినవాళ్లంతా తలాకొన్ని పరుగులు చేశారు. 

పంత్‌ సహా వారంతా విఫలం
ఢిల్లీ బౌలర్లలో హృతిక్‌ షోకీన్‌ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ తడబడింది. 42.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. పంత్‌ (28 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌), నితీశ్‌ రాణా (2), ప్రియాన్ష్‌ ఆర్య (5), సార్థక్‌ రంజన్‌ (1) విఫలమవడంతో ఢిల్లీకి పరాజయం తప్పలేదు.

ఒడిశా బౌలర్లలో దేబబ్రత ప్రధాన్, సంబిత బరల్‌ చెరో 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. గ్రూప్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి ఒక దాంట్లో ఓడిన ఢిల్లీ 12 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో రైల్వేస్‌ 4 వికెట్ల తేడాతో గుజరాత్‌పై... హర్యానా 7 వికెట్ల తేడాతో సర్వీసెస్‌పై గెలుపొందాయి.

చదవండి: IND vs NZ: టీమిండియా వికెట్‌ కీపర్‌ రేసులో ఆ ముగ్గురు.. బెస్ట్‌ ఆప్షన్‌ ఎవరంటే?

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)