Breaking News

ICC: మాకు అన్యాయం: నమీబియా కెప్టెన్‌ ఆరోపణలు

Published on Thu, 02/12/2026 - 13:36

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో టీమిండియా- నమీబియా మధ్య గురువారం నాటి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఇరుజట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో నమీబియా కెప్టెన్‌ గెర్హాడ్‌ ఎరాస్మస్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

కాగా ఈసారి వరల్డ్‌కప్‌ టోర్నీలో భారత్‌, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌, అమెరికాతో కలిసి గ్రూప్‌-‘ఎ’లో ఉంది నమీబియా. తొలి మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీలో నెదర్లాండ్స్‌తో తలపడి ఓటమిపాలైంది. తమ రెండో మ్యాచ్‌లో భాగంగా పటిష్ట టీమిండియాను ఢీకొట్టనుంది నమీబియా.

అన్యాయం
ఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఎరాస్మస్‌.. తమకు రాత్రి వేళ ప్రాక్టీస్‌ చేసే అవకాశం దక్కలేదని అసహనం వ్యక్తం చేశాడు. తమ దేశంలో ఎన్నడూ నైట్‌ మ్యాచ్‌లు ఆడలేదని.. అనుభవం లేనందున తమకు ప్రాక్టీస్‌కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఒక రకంగా ఇది తమకు అన్యాయం చేయడం లాంటిదేనని పరోక్షంగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC)ని తప్పుబట్టాడు.

టీమిండియాకు రెండు.. మాకు సున్నా!
కాగా ఈ టోర్నీలో నమీబియా తమ మ్యాచ్‌లు ఉదయం లేదంటే మధ్యాహ్నం ఆడనుంది. కేవలం టీమిండియాతో మ్యాచ్‌ను మాత్రమే రాత్రి షెడ్యూల్‌ చేశారు. అయితే, ఇంత వరకు తమకు ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఆడిన అనుభవం లేదన్న ఎరాస్మస్‌.. కనీసం ప్రాక్టీస్‌కైనా అవకాశం లేకుండా పోయిందన్నాడు.

అదే సమయంలో టీమిండియాకు మాత్రం రెండు నైట్‌ సెషన్‌లు ఇచ్చారని వాపోయాడు. ఈ మేరకు.. ‘‘ఇండియాతో మ్యాచ్‌కు ముందు మాకు నైట్‌ సెషన్‌ కేటాయించలేదు. ఎందుకిలా చేశారో అర్థం కావడం లేదు. కానీ టీమిండియాకు మాత్రం రాత్రి పూట రెండు ప్రాక్టీస్‌ సెషన్లు ఇచ్చారనుకుంటా.

నమీబియన్ల పోరాట పటిమ చూస్తారు
వాళ్లతో పాటు కెనడా కూడా నైట్‌ సెషన్‌లో ప్రాక్టీస్‌ చేసింది. నిజానికి కెనడా తదుపరి మ్యాచ్‌ మధ్యాహ్నం ఉంది. అయినా మేమేమీ వెనక్కి తగ్గము. నమీబియన్ల పోరాటం ఎలా ఉంటుందో చూపిస్తాము’’ అని గెర్హాడ్‌ ఎరాస్మస్‌ పేర్కొన్నాడు. అదే విధంగా..

‘‘నమీబియాలో మాకు ఫ్లడ్‌లైట్లు ఉండవు. మా దగ్గర ఆ సదుపాయం లేదు. కాబట్టి ఈసారి కొత్తగా ఇక్కడ నైట్‌ ఆడటం సరికొత్త సవాలు. అయితే, మా వాళ్లలో కొంతమందికి విదేశీ లీగ్‌లలో ఆడిన అనుభవం ఉండటం సానుకూలాంశం’’ అని ఎరాస్మస్‌ చెప్పుకొచ్చాడు.
UPDATE: భారత్‌కు భారీ విజయం.. 93 పరుగులతో నమీబియా ఓటమి

చదవండి: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ!

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)