Breaking News

వైభవ్‌ విఫలం.. ఇంగ్లండ్‌ చేతిలో తప్పని ఓటమి

Published on Tue, 01/13/2026 - 10:38

ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌-2026 వార్మప్‌ మ్యాచ్‌లో యువ భారత జట్టుకు పరాభవం ఎదురైంది. సన్నాహక మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై ఘన విజయం సాధించిన మాత్రే సేన.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మాత్రం ఓటమి పాలైంది. మెరుగైన స్కోరు సాధించినా.. లక్ష్యాన్ని కాపాడుకోలేక చతికిలపడింది.

జింబాబ్వే వేదికగా జనవరి 15 నుంచి అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీ మొదలుకానుంది. ఇందుకోసం భారత్‌- ఇంగ్లండ్‌ అండర్‌-19 జట్ల మధ్య సోమవారం బులవాయో వేదికగా సన్నాహక మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

అభిజ్ఞాన్‌ కుందు హాఫ్‌ సెంచరీ
ఓపెనర్లలో కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (49) మెరుగ్గా రాణించగా.. వైభవ్‌ సూర్యవంశీ (1) మాత్రం విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వేదాంత్‌ త్రివేది (14).. మిడిలార్డర్‌లో విహాన్‌ మల్హోత్రా (10) నిరాశపరిచారు.

ఇలాంటి పరిస్థితుల్లో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అభిజ్ఞాన్‌ కుందు ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యతను తలకెత్తుకున్నాడు. ఐదో స్థానంలో వచ్చిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. 99 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు.

రాణించిన బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు
అభిజ్ఞాన్‌కు తోడుగా బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు ఆర్‌ఎస్‌ అంబరీష్‌ (48), కనిష్క్‌ చౌహాన్‌ (45 నాటౌట్‌) రాణించారు. మిగిలిన వారిలో హర్‌వన్ష్‌ పంగాలియా (19) విఫలం కాగా.. ఖిలాన్‌ పటేల్‌ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయిన భారత అండర్‌-19 జట్టు 295 పరుగులు సాధించింది.

ఇంగ్లండ్‌ బౌలర్లలో జేమ్స్‌ మింటో ఐదు వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించగా.. సెబాస్టియన్‌ మోర్గాన్‌ రెండు, మ్యానీ లమ్స్‌డన్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో హెనిల్‌ పటేల్‌ ఆదిలోనే ఇంగ్లండ్‌కు షాకిచ్చాడు. ఓపెనర్‌ బెన్‌ డాకిన్స్‌ (8)ను స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు పంపాడు.

థామస్‌ ధనాధన్‌
ఇక ఖిలాన్‌ పటేల్‌.. మరో ఓపెనర్‌ జోసఫ్‌ మూర్స్‌ (46), వన్‌డౌన్‌ బ్యాటర్‌ బెన్‌ మేయస్‌ (34) వికెట్లు తీసుకున్నాడు. అయితే, నాలుగో నంబర్‌ బ్యాటర్‌ థామస్‌ ర్యూ మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. 66 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 71 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఇంగ్లండ్‌ గెలుపు
మరో ఎండ్‌ నుంచి కెలెబ్‌ ఫాల్కనర్‌ (29 నాటౌట్‌) థామస్‌కు సహకారం అందించాడు. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన కారణంగా డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి (DLS) ప్రకారం ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని 177 పరుగులుగా నిర్ణయించగా.. 34.3 ఓవర్లలోనే 196 పరుగులు సాధించింది. ఫలితంగా 20 పరుగుల తేడాతో భారత అండర్‌-19 జట్టుపై ఇంగ్లండ్‌ గెలుపొందింది. 

చదవండి: చరిత్ర సృష్టించిన పడిక్కల్‌.. తొలి ప్లేయర్‌గా అరుదైన రికార్డు

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)