Breaking News

‘తుదిజట్టులో చోటు ఇవ్వనపుడు.. అతడికి చెప్పిందిదే’

Published on Fri, 03/13/2026 - 13:19

జట్టులో చోటే లేని దుస్థితి నుంచి టీ20 ప్రపంచకప్‌-2026 హీరోగా నీరాజనాలు అందుకునే స్థాయికి ఎదిగాడు సంజూ శాంసన్‌. ఈ ఐసీసీ టోర్నీకి ముందు ఓపెనర్‌గా తుదిజట్టులో సంజూ స్థానం గల్లంతైంది. వరుస వైఫల్యాలే ఇందుకు కారణం. 

అదే సమయంలో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan).. ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌గా సంజూను రీప్లేస్‌ చేశాడు. వరుస మ్యాచ్‌లలో అదరగొడుతూ తుదిజట్టులో స్థానం పదిలం చేసుకున్నాడు.

అలా వచ్చి
ఇక సంజూ ఈసారి కూడా వరల్డ్‌కప్‌ ఆడే పరిస్థితి ఉండకపోవచ్చు అని అభిమానులు నిరాశచెందిన వేళ.. అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) కడుపునొప్పితో లీగ్‌ దశలో నమీబియాతో మ్యాచ్‌కు దూరం అయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఇషాన్‌తో పాటు సంజూ ఓపెనర్‌గా బరిలో దిగాడు. 

నాకౌట్‌ మ్యాచ్‌లలో ఆకాశమే హద్దుగా
అనంతరం సూపర్‌-8లో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్‌లోనూ ఈ కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌కు చోటు దక్కింది. ఈ రెండు మ్యాచ్‌లలో వేగంగా ఆడే క్రమంలో సంజూ అవుటైనా.. నాకౌట్‌ మ్యాచ్‌లలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

సూపర్‌-8లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన సంజూ శాంసన్‌.. జట్టును సెమీస్‌ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో 89 పరుగులు చేసిన ఈ కుడిచేతివాటం బ్యాటర్‌.. న్యూజిలాండ్‌తో ఫైనల్లోనూ 89 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది  టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. మొత్తంగా ఈ టోర్నీలో కేవలం ఐదు మ్యాచ్‌లే ఆడి ఏకంగా 321 పరుగులతో సంజూ సత్తా చాటాడు.

అతడు తలచుకుంటే మూడూ సెంచరీలు అయ్యేవి
ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌పై టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తాజాగా ప్రశంసలు కురిపించాడు. ‘‘తుది జట్టులో శాంసన్‌కు చోటు ఇవ్వలేనప్పుడు సర్ది చెప్పాల్సి వచ్చింది. ఇది కఠిన సమయం కావచ్చు కానీ దేవుడు దయతలిస్తే నీకూ అవకాశం వస్తుంది. అప్పుడు నువ్వేంటో చూపించాలి అన్నాను.

దాని కోసం మాత్రం అతడు ఎప్పుడూ సిద్ధమవుతూనే వచ్చాడు. చివరి వరుస మూడు మ్యాచ్‌లలో శాంసన్‌ ప్రతాపం ఏమిటో చూశాం. అతడు అనుకుంటే ఈ మూడు ఇన్నింగ్స్‌లు కూడా సెంచరీలుగా మారేవి. 

కానీ అతను మాత్రం జట్టు కోసమే ఆడాడు’’ అని ‘చెట్టా (మలయాళంలో పెద్దన్న అనే అర్థం)’ సంజూను సూర్య కొనియాడాడు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా జట్టు గెలుపే లక్ష్యంగా నిస్వార్థంగా ఆడాడని ప్రశంసించాడు.

చదవండి: రోహిత్‌-కోహ్లి అభిమానులకు శుభవార్త

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)