రేపు టెస్టు జట్టు ప్రకటన.. బుమ్రా ఆడకపోతే అతడికే చాన్స్‌!

Published on Mon, 07/27/2026 - 14:00

జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా త‌ర్వాతి సిరీస్ శ్రీలంక‌తో ఆడ‌నుంది. లంక ప‌ర్య‌ట‌న‌లో ఈసారి వైట్‌బాల్ సిరీస్‌కు బదులుగా సంప్ర‌దాయ టెస్టు సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్‌కు భార‌త్ జ‌ట్టును మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించ‌నుంది. ఏడాది కాలంగా టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉన్న జ‌స్‌ప్రీత్ బుమ్రా, ర‌వీంద్ర జ‌డేజాలు తిరిగి టెస్టుల్లో ఆడ‌నున్నార‌నేది ఆస‌క్తిగా మారింది. 

అయితే లంక‌తో టెస్టు సిరీస్‌కు స్పీడ‌స్ట‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా దూర‌మయ్యే అవ‌కాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బుమ్రా ఒక‌వేళ లంక‌తో టెస్టు సిరీస్‌కు దూర‌మైతే అత‌డి స్థానంలో ఎవ‌రిని ఎంపిక చేయాల‌న్న‌ది బీసీసీఐ ఆలోచిస్తుంది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల లంక‌-ఏ జ‌ట్టుతో జ‌రిగిన అన‌ధికారిక టెస్టులో 10 వికెట్లు ప‌డ‌గొట్టి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసిన గుర్నూర్ బ్రార్ ఎంపిక‌లో ముందు వ‌రుస‌లో ఉన్నాడు. 

స్వ‌దేశంలో ఆఫ్గ‌న్‌తో జ‌రిగిన ఏకైక టెస్టుకు ఎంపికైన‌ప్ప‌టికీ గుర్నూర్ బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. అయితే అఫ్గానిస్తాన్తో జ‌రిగిన వ‌న్డే సిరీస్ ద్వారా గుర్నూర్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అయితే టెస్టు క్రికెట్‌లో మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వ‌ని గుర్నూర్‌, లంక‌తో సిరీస్‌లో బుమ్రా స్థానంలో ఆడే అవ‌కాశాలున్నాయి. బుమ్రా దూర‌మైతే మాత్రం సిరాజ్‌, ప్ర‌సిధ్ భార‌త పేస్ బౌలింగ్ ద‌ళాన్ని న‌డిపించ‌నున్నారు.

ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదిక‌గా రెండో వ‌న్డే స‌మయంలో మోకాలి గాయంతో బాధ‌ప‌డ్డాడు. దీంతో చివరి వ‌న్డేకు దూర‌మ‌య్యాడు. జూలై 24న బుమ్రాకు నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో అత‌డి మోకాలు వాపు ఉంద‌ని తేలింది. దీంతో త‌దుప‌రి ప‌రీక్ష‌ల కోసం బెంగ‌ళూరులోని బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌కు వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం. 

ఈ లెక్క‌న బుమ్రా త‌న ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవ‌డంలో విఫ‌ల‌మైతే లంక‌తో సిరీస్‌కు అత‌డు దూర‌మ‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే హ‌ర్షిత్ రానా, నితీశ్ కుమార్‌రెడ్డి, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌లు కూడా గాయాల‌తో బాధ‌ప‌డుతూ లంక‌తో టెస్టు సిరీస్ ఆడ‌డం అనుమానంగా మారింది. 

టీమిండియా 2017లో చివ‌రిసారి లంక‌లో టెస్టు సిరీస్ ఆడింది. అప్ప‌టి సిరీస్‌లో కోహ్లి, అశ్విన్‌తో పాటు పుజారా ఆడారు. ఈ సిరీస్‌లో ఆతిథ్య లంక జ‌ట్టును వైట్‌వాష్ చేసింది. తాజాగా గిల్ నేతృత్వంలోని టీమిండియా లంక గ‌డ్డ‌పై స‌రికొత్త స‌వాల్‌కు సిద్ధ‌మ‌యింది.

Read: ‘అగార్కర్‌ వింటున్నావా? వైభ‌వ్‌ను రోహిత్‌కు జ‌తగా పంపాలి’

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)