Breaking News

T20 WC 2026: టీమిండియా ఓపెనర్లుగా ఊహించని పేర్లు!

Published on Sat, 08/30/2025 - 20:46

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న ఘనత టీమిండియా సొంతం. మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni) సారథ్యంలో 2007లో  పొట్టి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత దాదాపు పదిహేడేళ్లకు అంటే.. 2024లో మరోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది భారత్‌.

రో- కో గుడ్‌బై చెప్పిన తర్వాత
అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా గతేడాది ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా టోర్నీలో రోహిత్‌ సేన.. ఆఖరి వరకు అజేయంగా నిలిచి చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి కప్‌ను గెలుచుకుంది. ఈ ఐసీసీ ఈవెంట్లో ఓపెనర్లుగా వచ్చిన విరాట్‌ కోహ్లి (Virat Kohli)- రోహిత్‌ శర్మ (Rohit Sharma).. టీమిండియా విజయం తర్వాత అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు.

అభి- సంజూ జోడీ హిట్‌
ఇక కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ స్థానాన్ని సూర్యకుమార్‌ యాదవ్‌ భర్తీ చేయగా.. భారత టీ20 జట్టు ఓపెనర్లుగా అభిషేక్‌ శర్మ- సంజూ శాంసన్‌ నిలదొక్కుకున్నారు. శుబ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌ టెస్టులతో బిజీ కావడంతో ఈ జోడీకి వరుస అవకాశాలు వచ్చాయి.

అయితే, ఆసియా కప్‌-2025 టోర్నీ సందర్భంగా టీమిండియా ఓపెనర్లు మారే అవకాశం ఉంది. ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఈ ఖండాంతర టోర్నీకి ప్రకటించిన జట్టులో గిల్‌ స్థానం దక్కించుకున్నాడు. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ టెస్టు కెప్టెన్‌.. టీ20 జట్టు వైస్‌ కెప్టెన్‌గానూ ఎంపికయ్యాడు.

స్టాండ్‌ బై ప్లేయర్‌గా మాత్రమే
జట్టు ప్రకటన సందర్భంగా టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ వ్యాఖ్యలను బట్టి.. ఒక ఓపెనర్‌గా అభిషేక్‌ శర్మ ఖరారు అయినట్లే. అతడికి జోడీగా సంజూను కాదని గిల్‌ను పంపే అవకాశాలే ఎక్కువ. ఇక ఈ మెగా ఈవెంట్‌కు ప్రకటించిన ప్రధాన జట్టులో యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కనే లేదు. అతడు స్టాండ్‌ బై ప్లేయర్‌గా మాత్రమే ఎంపికయ్యాడు.

ఓపెనర్ల రేసులో ఊహించని పేర్లు
ఇక టీ20 ప్రపంచకప్‌-2026కు సన్నాహకంగా భావిస్తున్న ఆసియా కప్‌-2025 టోర్నీతో అభిషేక్‌- గిల్‌ టీమిండియా ఓపెనింగ్‌ జోడీగా దాదాపు ఖరారైనట్లే. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్‌ సురేశ్‌ రైనా మాత్రం భిన్నంగా స్పందించాడు. వచ్చే ఏడాది జరిగే పొట్టి ప్రపంచకప్‌ టోర్నీలో టీమిండియా ఓపెనర్ల రేసులో ఊహించని పేర్లు చెప్పాడు.

ప్రియాన్ష్‌ ఆర్య కూడా ఓ ఆప్షన్‌!
శుభంకర్‌ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి యశస్వి ఓ ఓపెనర్‌గా ఉండొచ్చు. అంతేకాదు ప్రియాన్ష్‌ ఆర్యపై కూడా సెలక్టర్లు దృష్టి సారించవచ్చు. ఇక అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ ఉండనే ఉన్నారు.

ఇప్పటికే తమను తాము నిరూపించుకున్నారు. రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా రేసులో ఉండవచ్చు. అయితే, నా మొదటి ప్రాధాన్యం మాత్రం అభిషేక్‌ శర్మకే. ఇక కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ నియమితుడుకాడని చెప్పేందుకు పెద్ద కారణాలు లేవు’’ అని రైనా పేర్కొన్నాడు. 

కాగా ఐపీఎల్‌-2025లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున అరంగేట్రం చేసిన ప్రియాన్ష్‌ ఆర్య 17 మ్యాచ్‌లలో కలిపి 475 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉండటం విశేషం. 

చదవండి: వైభవ్‌? ఆయుశ్‌ మాత్రే?.. అతడే ముందుగా టీమిండియాలోకి వస్తాడు!

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)