Breaking News

ఇషాన్ కిష‌న్ ప్ర‌పంచ రికార్డు

Published on Wed, 09/16/2026 - 01:13

టీమిండియా వికెట్ కీప‌ర్ ఇషాన్ కిష‌న్ అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ప్ర‌పంచ రికార్డు సాధించాడు. ఒక క్యాలెండ‌ర్ ఇయర్‌లో భార‌త్ త‌ర‌ఫున టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలో ఇషాన్ కిష‌న్ రెండో  స్థానంలో నిలిచాడు. 2026 ఏడాదిలో ఇషాన్ కిష‌న్ 173.2 స్ట్రైక్‌రేట్‌తో 892 ప‌రుగులు సాధించాడు. 

తొలి స్థానంలో సూర్య‌కుమార్ యాద‌వ్ (2022లో 187.43 స్ట్రైక్‌రేట్‌తో 1164 ప‌రుగులు) కొన‌సాగుతున్నాడు. ఇక 2025లో అభిషేక్ శ‌ర్మ 193.46 స్ట్రైక్‌రేట్‌తో 859 ప‌రుగులు సాధించి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ ముగ్గురి త‌ర్వాత విరాట్ కోహ్లి (2022లో 781 ప‌రుగులు), సూర్య‌కుమార్ యాద‌వ్ (2023లో 733 ప‌రుగులు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే.. రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్ విధించిన 160 ప‌రుగుల ల‌క్ష్యాన్ని టీమిండియా 14.4 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. సంజూ శాంస‌న్ (57) అర్థ‌సెంచ‌రీతో రాణించ‌గా, అభిషేక్ శ‌ర్మ (39), ఇషాన్ కిష‌న్ (34 నాటౌట్‌) రాణించారు.  చివ‌ర్లో తిల‌క్ వ‌ర్మ (15 నాటౌట్‌) జ‌ట్టును గెలిపించాడు. ర‌షీద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. 

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో నితీశ్‌కుమార్ రెడ్డి మూడు వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు, బుమ్రా, అక్షర్ పటేల్‌, బిష్ణోయిలు తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇరుజట్ల మధ్య చివరి టీ20 గురువారం ఇదే స్టేడియం వేదికగా జరగనుంది.

ఇదీ చ‌ద‌వండి: యూపీఐ చార్జీలు.. ఏటా 84 వేల కోట్ల ఆదాయం!

శాంసన్‌ మెరుపులు.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)