IPL 2026: ఎనిమిది మంది కెప్టెన్లు ఫిక్స్‌!.. మరి ఆ రెండు?

Published on Tue, 11/18/2025 - 15:38

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)-2026 సీజన్‌కు ఫ్రాంఛైజీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అట్టిపెట్టుకునే, విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన పది జట్లు.. వేలానికి సన్నద్ధమయ్యాయి. ఖరీదు అనుకున్న ఆటగాళ్లను ఆక్షన్‌లోకి వదిలి.. తిరిగి తక్కువ ధరకు సొంతం చేసుకోవాలని కొన్ని ఫ్రాంఛైజీలు భావిస్తుండగా.. భారం అనుకున్న ఆటగాళ్లను మరికొన్ని ఫ్రాంఛైజీలు ట్రేడ్‌ చేసుకున్నాయి.

జడ్డూకు బదులుగా సంజూ
ఇక ట్రేడింగ్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)- రాజస్తాన్‌ రాయల్స్‌ (RR) మధ్య జరిగిన ఒప్పందం హైలైట్‌గా నిలిచింది. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను రాజస్తాన్‌కు ఇచ్చేసిన సీఎస్‌కే.. ఆ జట్టు కెప్టెన్‌ సంజూ శాంసన్‌ను తమ ఫ్రాంఛైజీలోకి ఆహ్వానించింది. సంజూ రిటైన్‌ ధర రూ. 18 కోట్లు చెల్లించి మరీ రాజస్తాన్‌ నుంచి అతడిని చెన్నై ట్రేడ్‌ చేసుకుంది.

రుతురాజ్‌ గైక్వాడ్‌కే ఓటు
ఈ నేపథ్యంలో సంజూకు సీఎస్‌కే పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరుగగా.. చెన్నై మాత్రం రుతురాజ్‌ గైక్వాడ్‌కే ఓటు వేసింది. రిటెన్షన్‌, రిలీజ్‌ జాబితా విడుదల చేసిన వెంటనే రుతును తమ కెప్టెన్‌గా కొనసాగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తాజాగా అదే బాటలో నడువగా.. గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీలు కూడా తమ పాత కెప్టెన్లనే 2026లోనూ కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.

ఇంకా సారథిని ప్రకటించని ఆ రెండు జట్లు
అయితే, కెప్టెన్‌ సంజూను సీఎస్‌కేకు ట్రేడ్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ మాత్రం కొత్త సారథి పేరును ఇంకా ప్రకటించలేదు. మరోవైపు.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కూడా తమ కెప్టెన్‌గా అజింక్య రహానేను కొనసాగిస్తారా? లేదా? అన్న విషయం గురించి స్పష్టతనివ్వలేదు. కాగా డిసెంబరు 16న అబుదాబి వేదికగా ఐపీఎల్‌-2026 మినీ వేలం జరుగనుంది.

ఐపీఎల్‌-2026లో జట్ల కెప్టెన్లు వీరే
👑చెన్నై సూపర్‌ కింగ్స్‌- రుతురాజ్‌ గైక్వాడ్‌
👑సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- ప్యాట్‌ కమిన్స్‌
👑గుజరాత్‌ టైటాన్స్‌- శుబ్‌మన్‌ గిల్‌
👑లక్నో సూపర్‌ జెయింట్స్‌- రిషభ్‌ పంత్‌
👑రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- రజత్‌ పాటిదార్‌
👑ఢిల్లీ క్యాపిటల్స్‌- అక్షర్‌ పటేల్‌
👑పంజాబ్‌ కింగ్స్‌- శ్రేయస్‌ అయ్యర్‌
👑ముంబై ఇండియన్స్‌- హార్దిక్‌ పాండ్యా.

చదవండి: వెంకటేశ్‌ అయ్యర్‌కు భారీ షాక్‌.. పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)