Breaking News

అతడు అత్యద్భుతం.. ఇది ఇండియా కోసం: సూర్య

Published on Mon, 02/16/2026 - 08:56

పాకిస్తాన్‌పై టీమిండియా మరోసారి విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఆధిపత్యాన్ని 8-1కు పెంచుకుంది. కొలంబోలో తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయి సల్మాన్‌ బృందం చిత్తు కాగా.. సూర్య సేన టీ20 ప్రపంచకప్‌-2026 సూపర్‌-8 దశకు అర్హత సాధించింది.

ఇది సార్‌ మా బ్రాండ్‌
ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav).. దాయాదిపై గెలుపు నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ విజయం ఇండియా కోసం. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడాలని ప్రణాళికలు రచించామో వాటిని పక్కాగా అమలు చేశాము. మా బ్రాండ్‌ను కొనసాగించాము.

అతడు అత్యద్భుతంగా ఆడాడు
ఈ వికెట్‌ మీద తొలుత బ్యాటింగ్‌ చేయడం మంచిదని అనుకున్నాం.  అనుకున్నట్లుగానే టాస్‌ ఓడినా మాకు బ్యాటింగ్‌ చేసే అవకాశమే వచ్చింది. ఇక ఇషాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన, అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న ఇషాన్‌.. టీమిండియా తరఫునా అదే విధంగా రాణిస్తున్నాడు.

ఈరోజు అతడు అత్యద్భుతంగా ఆడాడు. ఊహించని రీతిలో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. తిలక్‌, రింకూ, శివం కూడా తమ వంతు పాత్ర పోషించారు. ఇక్కడ 175 పరుగులు చేయడం మంచి విషయం. చేయాల్సిన దానికంటే ఇంకో 15-20 పరుగులు ఎక్కువే చేశామనుకుంటున్నాం.

బౌలర్లు సమిష్టిగా రాణించారు
ఇక పవర్‌ ప్లేలో అక్షర్‌ పటేల్‌ బాధ్యత తీసుకున్నాడు. వరుణ్‌, కుల్దీప్‌ కూడా రాణించారు. జట్టులోని ప్రతి ఒక్కరు తమ బాధ్యతను చక్కగా నెరవేర్చారు’’ అని జట్టు ప్రదర్శన పట్ల సూర్యకుమార్‌ యాదవ్‌ హర్షం వ్యక్తం చేశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. గ్రూప్‌-ఎలో భాగంగా భారత్‌- పాక్‌ ఆదివారం కొలంబో వేదికగా తలపడ్డాయి. ఆర్‌.ప్రేమదాస స్టేడియంలో టాస్‌ గెలిచిన పాక్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది.

ఇషాన్‌ విధ్వంసం
ఓపెనర్లలో అభిషేక్‌ శర్మ డకౌట్‌ కాగా.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఇషాన్‌ కిషన్‌ మెరుపు అర్ధ శతకం (40 బంతుల్లో 77)తో రాణించాడు. తిలక్‌ వర్మ (25), కెప్టెన్‌ సూర్య (32), శివం దూబే(27) ఫర్వాలేదనిపించారు. ఇక లక్ష్య ఛేదనలో పాక్‌ కేవలం 114 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

భారత బౌలర్లలో స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి చెరో రెండు వికెట్లు తీయగా.. తిలక్‌ వర్మ, కుల్దీప్‌ యాదవ్‌ తలా ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. పేసర్లలో బుమ్రా, హార్దిక్‌ పాండ్యా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. పాక్‌ను 61 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్‌ గ్రూప్‌-ఎ నుంచి సూపర్‌-8 చేరిన తొలి జట్టుగా నిలిచింది.

చదవండి: IND vs PAK: తిల‌క్ వ‌ర్మ‌పై గంభీర్ సీరియ‌స్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)