Breaking News

బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్‌పై మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Published on Sat, 06/21/2025 - 11:43

టీమిండియాతో తొలి టెస్టులో తొలి రోజు ఇంగ్లండ్‌కు భంగపాటే ఎదురైంది. లీడ్స్‌ వేదికగా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ బౌలింగ్‌ను భారత బ్యాటర్లు చితక్కొట్టారు. ఓపెనర్లలో కేఎల్‌ రాహుల్‌ (Kl Rahul- 42) రాణించగా.. యశస్వి జైస్వాల్‌ శతకం (101)తో చెలరేగాడు. ఇక ఈ సిరీస్‌తో భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా ప్రయాణం మొదలుపెట్టిన శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) కూడా సెంచరీతో కదం తొక్కాడు.

అదే విధంగా.. వైస్‌ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) కూడా అర్ధ శతకంతో మెరిశాడు. వెరసి శుక్రవారం నాటి తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి 85 ఓవర్లు ఆడిన టీమిండియా మూడు వికెట్లు నష్టపోయి 359 పరుగులు సాధించింది. తద్వారా ఆతిథ్య జట్టుపై పర్యాటక టీమ్‌ మొదటి రోజు పూర్తి ఆధిపత్యం కనబరిచింది.

కామన్‌ సెన్స్‌ ఉన్నవాళ్లు ఇలా చేయరు
ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లండ్‌ మాజీ సారథి మైకేల్‌ ఆథర్టన్ కూడా ఈ విషయంలో స్టోక్స్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

‘‘టాస్ గెలిచిన కెప్టెన్‌ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా అనిపించింది. గత ఆరు మ్యాచ్‌లలో తొలుత బౌలింగ్‌ చేసిన జట్టే విజయం సాధించిందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కాస్త కామన్‌ సెన్స్‌ ఉన్నవాళ్లు..  క్రికెట్‌ బుర్ర వాడేవారు ఎవరైనా ఇక్కడ టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌ తీసుకుంటారు.

ఎందుకంటే.. ఇక్కడ ఇప్పుడు తీవ్రమైన ఎండ ఉంది. రానున్న రెండు రోజుల్లో 30 డిగ్రీలకు పైగానే ఉంటుంది. స్టోక్స్‌ కేవలం గత రికార్డు ఆధారంగానే తొలుత బౌలింగ్‌ ఎంచుకుని ఉంటాడు’’ అని ఆథర్టన్‌ స్టోక్స్‌ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. అయితే, భారీ లక్ష్యాన్ని కూడా ఛేదించగల సత్తా ఇంగ్లండ్‌కు ఉందని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశాడు.

ఇంగ్లండ్‌ పశ్చాత్తాపం!
కాగా ఇంగ్లండ్‌ మరో మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ కూడా టాస్‌ విషయంలో ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక తీవ్రమైన ఎండ, పొడిగా ఉన్న పిచ్, స్వింగ్‌కు ఏమాత్రం అవకాశం లేని వాతావరణం, పెద్దగా అనుభవం లేని బౌలర్లు... ఇలాంటి స్థితిలో టాస్‌ గెలిచి స్టోక్స్‌ బౌలింగ్‌ ఎంచుకునే సాహసం చేయడంతో ఇంగ్లండ్‌ పశ్చాత్తాపపడాల్సిన పరిస్థితి తలెత్తింది.

నిజమే... హెడింగ్లీ మైదానంలో గత ఆరు టెస్టుల్లో ముందుగా బౌలింగ్‌ చేసిన జట్టే గెలిచింది. కానీ శుక్రవారం పరిస్థితి వాటికి భిన్నం. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై భారత బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడటం చూస్తే తాము చేసిన తప్పేమిటో ఇంగ్లండ్‌కు అర్థమై ఉంటుంది. కాగా టెండుల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లింది.

ఇంగ్లండ్‌ చేజారిన అవకాశాలు.. పెనాల్టీ పరుగులు
👉45 పరుగుల వద్ద జైస్వాల్‌కు అదృష్టం కలిసొచ్చింది. కార్స్‌ వేసిన యార్కర్‌ను అతను చివరి నిమిషంలో నిలువరించగలిగాడు. ఇంగ్లండ్‌ అప్పీల్‌కు సిద్ధమైన తరుణంలో అంపైర్‌ దానిని ‘నోబాల్‌’గా ప్రకటించాడు. ఆ తర్వాత రీప్లే చూస్తే బంతి ముందుగా అతని ప్యాడ్‌కు తాకినట్లు తేలింది. ‘నోబాల్‌’ కాకపోతే అది కచ్చితంగా అవుట్‌గా తేలేది. 

👉గిల్‌ 1 పరుగు వద్ద ఉన్నప్పుడు కార్స్‌ బౌలింగ్‌లో కష్టసాధ్యమైన సింగిల్‌ కోసం ప్రయత్నించాడు. అయితే గిల్‌ చాలా దూరంలోనే ఉన్నా... పోప్‌ వేసిన త్రో నేరుగా వికెట్లకు తాకకపోవడంతో రనౌట్‌ కాకుండా తప్పించుకున్నాడు. ఓవర్‌త్రో బౌండరీని చేరడంతో మరో నాలుగు పరుగులు జట్టు ఖాతాలో చేరాయి. 

👉టీ విరామానికి ముందు స్టోక్స్‌ వేసిన చివరి ఓవర్లో స్లిప్‌ ఫీల్డర్‌ రూట్‌ బంతిని ఆపే క్రమంలో దానిని పక్కకు తోశాడు. అది అక్కడే పెట్టిన వికెట్‌ కీపర్‌ హెల్మెట్‌ను తాకడంతో భారత్‌కు ఐదు పెనాల్టీ పరుగులు అదనంగా లభించాయి. ఈ గందరగోళంలో అంపైర్‌ లెక్క తప్పడంతో ఈ ఓవర్లో స్టోక్స్‌ 7 బంతులు వేశాడు.  

చదవండి: నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!.. నో చెప్పడం వల్లే ఇలా..

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు