Breaking News

IND vs SL: శతకాలతో చెలరేగిన భారత ఓపెనర్లు

Published on Wed, 07/15/2026 - 18:36

శ్రీలంక అండర్‌-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్లు లక్ష్య రాజేశ్‌ రాయ్‌చందాని, సాగర్‌ విర్క్‌ శతక్కొట్టారు. నిలకడగా, ఓపికగా ఆడుతూ భారీ సెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరి ఇన్నింగ్స్‌ కారణంగా భారత్‌ పటిష్ట స్థితికి చేరుకుంది.

శ్రీలంక భారీ స్కోరు 
కాగా భారత్‌- శ్రీలంక అండర్‌-19 జట్ల మధ్య సోమవారం తొలి అనధికారిక టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సెనుజ వెకునగొడ డబుల్‌ సెంచరీ (233)తో దుమ్ములేపగా.. కెప్టెన్‌ విమత్‌ దిన్సార (52) అర్ధ శతకం బాదాడు.

మిగిలిన వారిలో కవిజ గమాగే (49), చమిక హీనతిగల (45), ఒషాడా మనాహర (12 బంతుల్లో 31 నాటౌట్‌) రాణించారు. ఈ క్రమంలో 106.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 424 పరుగులు చేసి శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ మంగళవారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి 58 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 186 పరుగులు చేసింది.

ఈ క్రమంలో 186/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో బుధవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన భారత జట్టుకు వర్షం మరోసారి ఆటంకం కలిగించింది. అయితే, కాసేపటి తర్వాత తెరిపినివ్వడంతో మళ్లీ మ్యాచ్‌ మొదలైంది. 

శతకాలతో చెలరేగిన భారత ఓపెనర్లు
ఈ క్రమంలో శతకం పూర్తి చేసుకున్న ఓపెనర్‌ సాగర్‌ (312 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్‌: 134 రన్స్‌).. లతేంద్ర ఆకాశ్‌ బౌలింగ్‌లో జేసన్‌ ఫెర్నాండోకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ కుశాగ్రా ఓజా 24 పరుగులే చేసి నిరాశపరచగా.. కెప్టెన్‌ యశ్‌వర్దన్‌ చౌహాన్‌ (6) పూర్తిగా విఫలమయ్యాడు. అయితే, మరో ఓపెనర్‌ లక్ష్య మాత్రం నిలకడగా ఆడుతూ డబుల్‌ సెంచరీకి చేరువయ్యాడు.

గాలేలో బుధవారం ఆట పూర్తయ్యేసరికి మొత్తంగా 306 బంతులు ఎదుర్కొన్న లక్ష్య.. 21 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 196 పరుగులు చేశాడు. అతడితో పాటు కుశ్‌ పటేల్‌ మూడు పరుగులతో అజేయంగా నిలిచాడు. 

ఈ క్రమంలో మూడో రోజు ఆట ముగిసేసరికి భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక కంటే ఇంకా 46 పరుగులు వెనుకబడి ఉంది. ఇక ఆటకు గురువారం చివరిరోజు. 

చదవండి: IND vs ENG: అతడిని ఆరోస్థానంలో ఆడిస్తారా?

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)