Breaking News

డబుల్‌ సెంచరీతో చెలరేగిన భారత ఓపెనర్‌

Published on Thu, 07/16/2026 - 12:54

శ్రీలంక అండర్‌-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్‌ లక్ష్య రాజేశ్‌ రాయ్‌చందాని మారథాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. నిలకడగా ఆడుతూ డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత కాసేపటికే పెవిలియన్‌ చేరాడు.

మూడు యూత్‌ వన్డేలు, రెండు యూత్‌ టెస్టులు ఆడేందుకు భారత అండర్‌-19 జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టు చేతిలో భారత్‌ 2-1 తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ఇరుజట్ల మధ్య సోమవారం తొలి యూత్‌ టెస్టు మొదలైంది.

గాలె వేదికగా టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సెనుజ వెకునగొడ డబుల్‌ సెంచరీ (267 బంతుల్లో 233)తో దుమ్ములేపగా.. కెప్టెన్‌ విమత్‌ దిన్సార (52), కవిజ గమాగె (45), ఒషాడా మనాహర (31*) రాణించారు. 

ఆధిక్యంలోకి భారత్‌
ఫలితంగా శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌ను 106.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 424 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం తమ ఆట మొదలుపెట్టిన భారత్‌.. గురువారం భోజన విరామ సమయానికి 55 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 378/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో చివరి రోజు ఆట ఆరంభించిన భారత జట్టు లంచ్‌ బ్రేక్‌ టైమ్‌కి 149 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 479 పరుగులు చేసింది.

లక్ష్య డబుల్‌ సెంచరీతో
కాగా బుధవారం 196 పరుగుల వద్ద నిలిచిన లక్ష్య.. గురువారం ద్విశతక మార్కును అందుకున్నాడు. మొత్తంగా 324 బంతుల్లో 22 ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 207 పరుగులు సాధించాడు. దిమత్‌ అబేయ్‌సింఘే బౌలింగ్‌లో బౌల్డ్‌ కావడంతో లక్ష్య మారథాన్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

ఇక మిగలిన వారిలో మరో ఓపెనర్‌ సాగర్‌ విర్క్‌ శతకం (134) సాధించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ కుశాగ్రా ఓజా 24 పరుగులు చేశాడు. కెప్టెన్‌ యశ్‌వర్దన్‌ చౌహాన్‌ (6) విఫలం కాగా.. కుశ్‌ పటేల్‌ 42 పరుగులతో రాణించాడు. 

గురువారం లంచ్‌ బ్రేక్‌ సమయానికి బీకే కిషోర్‌ 1, మానవ్‌ క్రిష్ణ 35 పరుగులతో క్రీజులో నిలిచారు. అంతకుముందు కావ్యా పటేల్‌ (8), జగన్నాథన్‌ హేంచుదేశన్‌ (0) అవుటయ్యారు. ఆటకు ఇదే చివరి రోజు కావడంతో ఈ మ్యాచ్‌ డ్రాగా ముగియడం లాంఛనమే కానుంది.

చదవండి: విధ్వంసకర శతకాలు.. పంజాబ్‌ కింగ్స్‌ ప్రపంచ రికార్డు బద్దలు

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)