Breaking News

'అందుకే సిరాజ్‌ను ప‌క్క‌న‌బెట్టాం'

Published on Wed, 11/04/2026 - 09:09

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో సీనియ‌ర్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్‌తో పాటు స్పెష‌లిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్‌ల‌ను తుదిజ‌ట్టు నుంచి త‌ప్పించ‌డంపై భార‌త కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ స్పందించాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అనంత‌రం జ‌ట్టు కూర్పుపై మాట్లాడాడు. 

‘‘మేము తొలుత బౌలింగ్ చేయాల‌నుకుంటున్నాం. వాతావ‌ర‌ణం కొద్దిగా మేఘావృతమై ఉంది. వ‌ర్షం అంత‌రాయంతో ఓవ‌ర్లు త‌గ్గిన‌ప్ప‌టికీ, స్కోరుబోర్డుపై మంచి టార్గెట్ ఉండ‌డం ఎల్ల‌ప్పుడూ మంచిదే. ఇక వ‌న్డే సిరీస్ కోసం మేము చేసుకున్న స‌న్నాహ‌కాలు బాగున్నాయి. ప్రాక్టీస్ సెష‌న్లు చాలా బాగా జ‌రిగాయి. 

కోహ్లి, రోహిత్ భాయ్‌ల‌తో పాటు మేమంతా ఈ సిరీస్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. సిరాజ్‌ను త‌ప్పించ‌డం వెనుక ఎలాంటి ఉద్దేశం లేదు. జ‌ట్టు ప్ర‌యోజ‌నాల కోస‌మే అత‌డిని త‌ప్పించాం. రాబోయే మ్యాచ్‌లో అత‌డు కీల‌కం కానున్నాడు. ఇక మ్యాచ్‌లో న‌లుగురు ప్ర‌ధాన పేస‌ర్ల కాంబినేష‌న్ ఉండాల‌ని కోచ్ గంభీర్ భావించ‌డంతోనే, ఆల్‌రౌండ‌ర్ నితీశ్‌రెడ్డికి చోటు ద‌క్క‌లేదు. 

ఆల్‌రౌండ‌ర్లుగా న‌మ‌న్ ధీర్‌, అక్ష‌ర్‌ప‌టేల్ స్పిన్ బాధ్య‌త‌లు మోయ‌నుండ‌డంతో కుల్దీప్‌ను బెంచ్‌కు ప‌రిమితం చేయాల్సి వ‌చ్చింది. వ‌చ్చే ఏడాది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ నేప‌థ్యంలో ఈ సిరీస్ మాకు మంచి స‌న్నాహ‌కంగా భావిస్తున్నాం’’ అని చెప్పుకొచ్చాడు.

తొలి వ‌న్డేకు భార‌త జ‌ట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, ఔకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్

ఇదీ చదవండి: సీరియస్‌గా మాట్లాడుకున్న గంభీర్‌, కోహ్లి!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)