ఫిఫా ఫైన‌ల్‌కు ముందు మెస్సీ చివ‌రి సందేశం!

Published on Sun, 07/19/2026 - 11:15

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ చివ‌రి అంకానికి చేరుకుంది. ఆదివారం జ‌ర‌గ‌నున్న ప్ర‌తిష్టాత్మక ఫిఫా ఫైన‌ల్లో డిఫెండింగ్ చాంపియ‌న్ అర్జెంటీనాతో స్పెయిన్ త‌ల‌ప‌డ‌నుంది. ఈసారి ఫిఫాలో జ‌ట్టు త‌ర‌ఫున అత్య‌ధిక గోల్స్ చేసిన మెస్సీ అన్నీ తానై అర్జెంటీనాను న‌డిపిస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో ఫైన‌ల్‌కు ముందు అర్జెంటీనా జ‌ట్టు, స‌హాయ‌క సిబ్బందితో క‌లిసి దిగిన గ్రూప్ ఫొటోను షేర్ చేసుకున్న మెస్సీ త‌న‌ చివ‌రి సందేశాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా పంచుకున్నాడు. 

ఫిఫా టోర్నీ ఆద్యంతం త‌నకు అండ‌గా నిలిచిన‌ స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌కు, కోచ్‌, స‌హాయ‌క సిబ్బందికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ ప్ర‌త్యేక లేఖ‌ను రాసుకొచ్చాడు. ఈ ఫిఫాలో ఫైన‌ల్ చేరే క్ర‌మంలో కేవ‌లం విజ‌యాలు మాత్ర‌మే కాకుండా జ‌ట్టు ప్ర‌యాణం కూడా త‌మ‌ను గొప్ప‌దిగా నిల‌బెట్టింద‌ని మెస్సీ తెలిపాడు. 

'ఇన్ని సంవ‌త్స‌రాల మా ప్రయాణంలో అత్యంత ఆనంద‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే.. మేము టైటిల్స్ గెల‌వ‌డ‌మే కాదు, ఈ ప్ర‌యాణంలో ఎన్నో అనుభూతుల‌ను పొందాము. అర్జెంటీనా జ‌ట్టులోని ఆట‌గాళ్ల‌తో క‌లిసి రోజువారి ప‌నుల‌ను పంచుకోవ‌డం, కలిసి పోటీ ప‌డ‌డం, క‌ష్ట స‌మ‌యాల్లో అండ‌గా నిలబ‌డ‌డం, ఇలా ప్ర‌తి అడుగును మ‌న‌స్ఫూర్తిగా ఆస్వాదించాం. 

నా ప్ర‌యాణంలో అండ‌గా నిలిచిన స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌కు, స‌హాయ‌క, సాంకేతిక సిబ్బంది, అర్జెంటీనా దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు. ఫిఫా టైటిల్ గెలుస్తామా లేదా అన్న సంగ‌తి ప‌క్క‌న‌బెడితే ఇప్ప‌టికే జ‌ట్టుగా మ‌రిచిపోలేని, చెరిగిపోని జ్ఞాప‌కాల‌ను చ‌రిత్రగా లిఖించుకున్నాం. క‌మాన్ అర్జెంటీనా.’ అని భావోద్వేగంతో పేర్కొన్నాడు. అర్జెంటీనా కెప్టెన్ ఇచ్చిన సందేశం ఆ జ‌ట్టు ఒక కుటుంబంలా క‌లిసి న‌డుస్తూ ధృడ‌మైన బంధాన్ని చాటిచెబుతుంది. స్పెయిన్‌తో జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా వార‌స‌త్వం మాత్రం సుర‌క్షితంగా ఉంటుంద‌ని మెస్సీ ప‌రోక్షంగా పేర్కొన్నాడు.

ఇక ఫిఫా ఫైన‌ల్ మెస్సీకి చివ‌రి అంత‌ర్జాతీయ మ్యాచ్ అవుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ మెస్సీ ఇచ్చిన తాజా సందేశం వైర‌ల్‌గా మారింది. ఫైన‌ల్‌కు ముందే ఇలాంటి సందేశాన్ని ఇవ్వ‌డం వెనుక మెస్సీ త‌న రిటైర్మెంట్ విష‌యాన్ని ప‌రోక్షంగా వెల్ల‌డించాల‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ఇక ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026 టోర్నీలో మెస్సీ ఏడు మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌తో పాటు నాలుగు అసిస్ట్‌ల‌తో గోల్డెన్ బూట్ రేసులో రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఫ్రాన్స్ సూప‌ర్‌స్టార్ కైలియ‌న్ ఎంబాపె 8 మ్యాచ్‌ల్లో 10 గోల్స్‌తో పాటు 4 అసిస్ట్‌ల‌తో తొలి స్థానంలో ఉన్నాడు. భార‌త కాల‌మాన ప్ర‌కారం అర్జెంటీనా, స్పెయిన్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ ఆదివారం అర్ధ‌రాత్రి 12.30 గంట‌ల‌కు మొద‌లుకానుంది.

 

Read: సింధుదే జపాన్‌ ఓపెన్‌.. తొలి భారత షట్లర్‌గా రికార్డు

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)