‘చంద్రబాబు సర్కార్‌ ఎందుకు తోకముడిచింది?’

Published on Sat, 02/21/2026 - 12:33

సాక్షి, విజయవాడ: ఏపీలో లడ్డూ రాజకీయం నడుస్తోందంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయానికి వాడుకుందని దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తిరుపతి లడ్డూలో జంతువు కొవ్వు కలిసిందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర పెద్దగా బాధ్యతగా ఉండాల్సిన ముఖ్యమంత్రి అసత్యాలు, అబద్ధాలు ఆడారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎలాంటి జంతువుల కొవ్వు లేదు.. కల్తీ జరగలేదని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పేర్కొందని.. చేసిన తప్పుడు ప్రచారానికి కూటమి నేతలు, ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని మల్లాది విష్ణు డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ, వైఎస్‌ జగన్‌ను హిందువులకు దూరం చేయాలని కుట్రపన్నారు. సీబీఐ రిపోర్టు ఇచ్చినా జగన్‌పై బురదజల్లడం మానుకోలేదు. సీబీఐ ఛార్జిషీట్ కోర్డులో ఫైల్ చేసిన తర్వాత కూడా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. మీ కనుసన్నల్లో ఉన్న రిటైర్డ్ అధికారితో ఏకసభ్య కమిషన్ వేస్తే వాస్తవాలను ఎలా ఇస్తుంది’’ అంటూ మల్లాది విష్ణు ప్రశ్నించారు.

‘‘గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే ఏకసభ్య కమిషన్ ఏంచేసింది?. వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో తొక్కిసలాట జరిగితే మీ కమిషన్ ఏంచేసింది?. ఇందాపూర్, బోలేబాబా, హెరిటేజ్‌పై చర్చకు శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ తీర్మానం ఇచ్చింది. తీర్మానంపై కూటమి ప్రభుత్వం ఎందుకు తోకముడిచిందో సమాధానం చెప్పాలి. జంతువుల కొవ్వు, బాత్ రూమ్ కెమికల్స్ కలిపినట్లు ఏ ఆధారాలతో మాట్లాడారో సమాధానం చెప్పాలి.

..ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత నుంచి చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలి. తిరుపతి లడ్డూ చాలా సున్నితమైన అంశమని అసెంబ్లీలో చెబుతున్నారు. క్యాబినెట్ లో లడ్డూ అంశంపై చర్చించినప్పుడు తెలియదా ఇది సున్నితమైన అంశమని.. ఈ ప్రభుత్వం వేసింది ఏకసభ్య కమిషన్ కాదు తెలుగుదేశం కమిషన్. లడ్డూపై రాజకీయం చేసిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదో సమాధానం చెప్పాలి. ఏడు కొండలను రెండు కొండలు చేస్తానన్నాడని వైఎస్సార్‌పై అపవాదులు వేశారు.

..ఏడుకొండలను కాపాడాలని వైఎస్సార్ 746,747 జీవోలను తెచ్చారు. ఎంతకాలం కూటమి నేతలు దేవుడితో రాజకీయం చేస్తారు. కూటమి 20 నెలల పాలనలో ఏపీ కేంద్రంగా గోమాంసం ఎగుమతి అవుతోంది. విశాఖలో లక్షల కిలోల గో మాంసాన్ని పట్టుకున్నారు. గో మాంసం దొరికితే కూటమి నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు?. ఏపీలో గోవులు యథేచ్ఛగా హత్యకు గురవుతుంటే ఏం చేస్తున్నారు?. గోవుల అక్రమ రవాణా జరుగుతుంటే కళ్లప్పగించి చూస్తున్నారు. గోబెల్స్ మంత్రులంతా వైఎస్సార్‌సీపీ హిందూ మతానికి క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు. మంత్రులు ఏ మొహం పెట్టుకుని హిందూ ధర్మానికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు.

..దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు కొట్టేయడానికి జీవో నెంబర్ 15 తెచ్చారు. గొడుగుపేట ఆలయం భూములు కొట్టేయాలని చూశారు. టెక్కలిలో ఆలయ భూములు కొట్టేయాలని చూశారు. నిరాధార ఆరోపణలు చేసిన శ్రీశైలం ఆలయ ఛైర్మన్‌ను తక్షణమే ప్రభుత్వం డిస్మిస్ చేయాలి. సీబీఐ రిపోర్టు బయటికి వచ్చాక టీడీపీ నేతలకు మొహం చెల్లడం లేదు. నిన్న కూటమి మంత్రులతో లోకేష్ బలవంతంగా మాట్లాడించినట్లు తెలుస్తోంది. 21, 22, 23 తేదీల్లో ప్రజలకు, గుళ్లవద్దకు, స్వామీజీల వద్దకు వెళతామంటున్నారు. ఏపీలో ఏ దేవాలయం, స్వామీజీ వద్దకు వెళ్లి మీరు చెప్పగలుగుతారు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. కల్తీ జరగకుండానే తిరుపతి లడ్డూని రాజకీయానికి వాడుకున్నారు.

..ఏ మొహం పెట్టుకుని వెంకటేశ్వరస్వామి వద్దకు వెళ్లి వైఎస్సార్‌సీపీ గురించి చెబుతారు. శ్రీకాళహస్తీశ్వరుడి దగ్గరకు వెళ్లి ఆ స్వామికి ఏం సమాధానం చెబుతారు?. శివరాత్రికి  వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయలేకపోయారని ఆ స్వామి మిమ్మల్ని ప్రశ్నించరా?. కాళహస్తిలో వెండి పడగలను కూటమి నేతలు అమ్ముకుంటున్నారు. తన వెండి పడగలను అమ్ముకుంటున్నారని ఆ స్వామి ప్రశ్నిస్తే ఏ మొహం పెట్టుకుని సమాధానం చెబుతారు?. శివభక్తులపై లాఠీలు ప్రయోగించిన మీరు శ్రీశైల మల్లేశ్వరుడికి ఏం సమాధానం చెబుతారు?. ట్రస్ట్ బోర్డు మెంబర్ భర్త దుర్గగుడి సిబ్బందిని దూషించారు. దుర్గగుడికి ఏ మొహం పెట్టుకుని వెళతారు?

..నా క్షేత్రంలో గోవులు చనిపోతే ఏం చేశారని ద్వారకా తిరుమలేశుడు అడిగితే ఏం సమాధానం చెబుతారు. ఎలుకలు తింటున్న తన ప్రసాదాన్ని భక్తులకు ఇస్తున్నారేంటయ్యా అని అన్నవరం సత్యదేవుడు అడిగితే ఏం సమాధానం చెబుతారు?. నాశిరకం గోడలు కట్టి భక్తులు చనిపోతే  ఏ మొహం పెట్టుకుని నాకు ఫిర్యాదు చేయడానికి వచ్చారయ్యా అని సింహాద్రి అప్పన్న అడిగితే ఏం సమాధానం చెబుతారు?.

..సినిమా వాల్‌ పోస్టర్ల పక్కన వెంకటేశ్వరస్వామిని నిలబెట్టడమేంటి?. నేరాలు కట్టడి చేయాల్సిన పోలీసులు టీడీపీ పెట్టిన బ్యానర్లకు కాపలా కాయడమేంటి?. హిందూ ధర్మానికి లెంపలేసుకుని క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబు, పవన్, కూటమి నేతలు. వైఎస్‌ జగన్‌కి సమాధానం చెప్పే అర్హత, సత్తా టీడీపీ నేతలకు లేదు’’ అని మల్లాది విష్ణు అన్నారు.

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)