Breaking News

బీఆర్‌ఎస్‌ ఓటమి.. అసలేం జరిగింది?

Published on Sat, 11/15/2025 - 19:01

సాక్షి, సిద్దిపేట: జూబ్లీహిల్స్‌ రూపంలో మరో సిట్టింగ్‌ స్థానాన్ని బీఆర్‌ఎస్‌ కోల్పోయింది. ఈ నేపథ్యంలో పార్టీ కీలక నేతలను ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌజ్‌కు రప్పించుకున్నారు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, హరీష్‌రావుతో పలువురు సీనియర్లతో శనివారం సాయంత్రం కేసీఆర్‌ భేటీ అయ్యారు. 

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితంపై వీళ్లిద్దరితో కేసీఆర్‌ సమీక్ష జరిపినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందని.. ఓటమికి గల కారణాలపై ఆయన వాళ్ల నుంచి ఆరా తీసినట్లు సమాచారం. అదే సమయంలో కేటీఆర్‌, హరీష్‌రావులపై ఆ పార్టీ మాజీ నేత, తనయ అయిన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. భేటీలో ఈ వ్యాఖ్యలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

జూబ్లీహిల్స్‌ ఓటమితో పాటు తాజా రాజకీయ పరిణామాలపైనా కేసీఆర్‌ వాళ్లతో చర్చించారు. వీళ్లద్దరితో పాటు జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేసిన మరికొందరు బీఆర్‌ఎస్‌ నేతలు ఈ సమీక్షలో పాల్గొన్నట్లు సమాచారం.  

ఇదిలా ఉంటే.. మాగంటి గోపినాథ్‌ సతీమణి సునీత 25 వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ చేతిలో ఓడిపోయారు. అయితే రౌడీయిజంతో ఈ ఎన్నికలో గెలిచారని.. నైతిక విజయం తనదేనంటూ ఫలితాలు వెలువడ్డాక ఆమె మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఏం జరిగిందో ప్రజలు చూశారని, పోరాటాలు తమ పార్టీకి కొత్త కాదని.. ప్రతిపక్ష పాత్రను మరింత బలంగా పోషించి వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం కోసం కృషి చేస్తామని కేటీఆర్‌ ఫలితాల అనంతరం మీడియా ద్వారా తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)