Breaking News

గిన్నిస్‌ బుక్‌లోని బాబు మోసాలు, దుర్మార్గాలు: సజ్జల

Published on Fri, 06/27/2025 - 13:49

ప్రజలకు ఎన్నికల వేళ హామీలను ఎంత తేలికగా ఇచ్చారో.. వాటిని అంతే తేలికగా ఇప్పుడు చంద్రబాబు కొట్టేస్తున్నారని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏడాదిలోనే ప్రజావ్యతిరేకతను కూటమి ప్రభుత్వం మూట కట్టుకుందని.. అందుకే బాబు మెడలు వంచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారాయన. అశేష ప్రజాదరణ ఉన్న వైఎస్‌ జగన్‌పై సర్కార్‌ ఎన్ని కుట్రలు చేసినా ప్రయోజనం ఉండదని సజ్జల తేల్చేశారాయన. 

సాక్షి, అనంతపురం: అబద్దాలను ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబును మించినవారు లేరని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శింగనమల నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం.. రీకాలింగ్ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో(Recalling Chandrababu’s Manifesto) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

చంద్రబాబు మోసాలను గుర్తుచేసేందుకే ఈ కార్యక్రమం. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు... ఇప్పుడు సంపద ఎలా సృష్టించాలో, సూపర్‌ సిక్స్‌ హామీలు ఎలా అమలు చేయాలో చెవిలో చెప్పాలంటున్నారు!. హామీలను తేలికగా ఇచ్చినట్లే.. అంతే తేలికగా కొట్టిపారేస్తుంటారాయన. అందుకే ఏడాది కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలన్న కుట్రలతో చంద్రబాబు సర్కార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్‌సీపీ నేతలను, కార్యకర్తలందరినీ జైల్లో పెట్టాలన్నది చంద్రబాబు కోరిక. వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు చేసి.. బాధితులపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. కానీ వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా.. చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదు చేయలేదు. స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాంలో అన్ని ఆధారాలతోనే చంద్రబాబుపై కేసు నమోదు చేశాం.

.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన మంచి చాలా ఉండేది. చంద్రబాబు దుర్మార్గాలను చెబుతూ పోతే వారం రోజులు పడుతుంది. చంద్రబాబు మోసాలు, దుర్మార్గాలను గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కించొచ్చు.  అబద్ధాలను ప్రచారంలో చంద్రబాబును మించినవారు లేరు. రాష్ట్రంలో మట్టి, ఇసుకను ఎల్లో మాఫియా మింగేస్తోంది. కూటమి నేతలు ఇళ్లకు వస్తే నిలదీయడానికి.. చంద్రబాబు మెడలు వంచడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మన దేశంలో రీకాల్ సిస్టం లేదు.. లేకపోతే చంద్రబాబు సర్కార్‌కు పదవీ గండం ఉండేది. 

.. హామీలపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం. గడికోట శ్రీకాంత్ రెడ్డి పై ఎస్వోజీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం దారుణం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేసేందుకు, ఆయన్ని లేకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. ఆయనకు ఉన్న భద్రతను తొలగించింది. పేరుకే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత.. ఆచరణలో అమలు చేయడం లేదు. 

.. సింగయ్య మృతి కేసులో జగన్‌పై కేసు నమోదు.. దుర్మార్గానికి పరాకాష్ట. ఎన్ని బెదిరింపులు వచ్చినా సత్తెనపల్లి లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని చూసేందుకు జనం పోటెత్తారు. వైఎస్ జగన్‌ను ఎంత అణచి వేయాలని చూస్తే... అంత ఎదుగుతారు. మంచి పనులు చేస్తే జనం ఆదరిస్తారన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించాలి. వైఎస్ జగన్‌కు మద్దతుగా లక్షల మంది ఉన్నారు. వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తే కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. 

సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలు చేయాలో బాబు చెవిలో చెప్పాలట..!

.. హామీలను త్రికరణ శుద్ధి తో అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ మాట తప్పారు. అందుకే రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఇంటింటికీ వచ్చే మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలను నిలదీయాలి. చంద్రబాబు మోసాలను ప్రజల్లో తీసుకెళ్లండి’’ అని సజ్జల పార్టీ శ్రేణులను ఉద్దేశించి పిలుపు ఇచ్చారు. 

ఇంకా రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్ట్‌ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు చంద్రబాబు మోసాలను వివరించారు. 

‘‘టీడీపీ కూటమి గెలుపు పై ఇప్పటికీ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంల అక్రమాల ద్వారా గెలిచారని ప్రజలు భావిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. చంద్రబాబు అక్రమ కేసులకు వైఎస్సార్ సీపీ నేతలు భయపడరు. నారా లోకేష్ రెడ్ బుక్‌ను ఎడమ కాలితో తన్ని ఎదిరిస్తాం. ప్రజలకు అండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ ఉంటారు’’

:::మాజీ మంత్రి శైలజానాథ్


ప్రజా సమస్యలపై పవన్ కల్యాణ్‌ ఎందుకు మౌనంగా ఉన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడరు?. దళిత, గిరిజన బాలికల పై అఘాయిత్యాలు జరిగితే పవన్‌కు పట్టదా?. 

:::మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్

చంద్రబాబు మోసాలను ప్రజల్లో కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా హామీలను అమలు చేయలేదు. చంద్రబాబుకు తెలిసిన ఏకైక విద్య వెన్నుపోటు. అప్పుడు ఎన్టీఆర్ కు... ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దే. నవరత్నాలను పకడ్బందీగా అమలు చేసి వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ పోరాట ఫలితంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. 

:::వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి


ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. టీడీపీ కూటమి పై రోజు రోజుకూ ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. టీడీపీ ఓటమి ఖాయం అని చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ ప్రతి రోజూ జగన్ జపం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం లో రైతులకు గిట్టుబాటు ధరలు దక్కటం లేదు. రైతులను గాలికొదిలేసి... మద్యం వ్యాపారులకు మాత్రమే చంద్రబాబు గిట్టుబాటు ధరలు కల్పించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ అమరావతి లో ఖర్చు చేస్తున్నారు. మిగిలిన జిల్లాల అభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. 

:::వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)