Breaking News

ఆటోడ్రైవర్‌ను తిట్టి.. చెప్పుతో కొట్టి, ఆపై శిరస్సు వంచి క్షమాపణలు

Published on Mon, 06/02/2025 - 15:15

బెంగళూరు: రాష్ట్రంలో కన్నడిగులపై.. కన్నడేతర వ్యక్తులు దాడులు చేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. వీటిని అక్కడి ప్రజలు కూడా అంతే తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. తాజాగా బెంగళూరులో ఓ మహిళ ఓ ఆటోడ్రైవర్‌ను ఇస్టానుసారం తిడుతూ చెప్పుతో కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కాగా.. గంటల వ్యవధిలోనే ఆమెతో క్షమాపణలు చెప్పించిన మరో వీడియో బయటకు వచ్చింది. 

పంకూరి మిశ్రా అనే మహిళ తన భర్తతో స్కూటీ మీద శనివారం బయటకు వెళ్లింది. శివాజీనగర్‌ ప్రాంతంలో.. వాళ్ల బండి పక్కనే ఆగిన ఆటోడ్రైవర్‌తో ఒక్కసారిగా ఆమె వాగ్వాదానికి దిగింది. ఆటో టైర్‌ తన కాలు మీద నుంచి వెళ్లిందని చెబుతూ ఆమె అతని దూషించసాగింది. అయితే అలాంటిదేం జరగలేదు కదా అని ఆ ఆటోడ్రైవర్‌ ఆమెకు బదులిచ్చాడు. అయినా ఆమె అస్సలు తగ్గలేదు. ఆమె తిట్ల పురాణాన్ని ఆ డ్రైవర్‌ ఫోన్‌లో వీడియో తీయబోయాడు. అంతే.. 

ఆ పరిణామంతో ఆ యువతి రగిలిపోయింది. ‘‘వీడియో తీస్తావా.. తీసుకో’’ అంటూ కాలికున్న చెప్పు తీసి అతన్ని కొట్టింది. స్థానికులు కొందరు సర్దిచెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది.  ఘటన జరిగిన వెంటనే ఆ ఆటోడ్రైవర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి పేరు లోకేష్‌గా తెలుస్తోంది. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నగర పోలీసులు సత్వర చర్యలకు దిగారు. ఆ యువతిని అరెస్ట్‌ చేశారు. 

ఆపై ఆమె స్టేషన్‌ బెయిల్‌ మీద బయటకు వచ్చింది. ఆదివారం సాయంత్రం ఆ ఆటోడ్రైవర్‌, మరికొందరి సమక్షంలో పంకూరి మిశ్రా క్షమాపణలు కోరింది. తాను గర్భవతినని, ఏదైనా అనుకోని ఘటన జరగొచ్చనే ఆందోళనతో తాను అలా ప్రవర్తించానని చెప్పుకొచ్చింది. జరిగిందానికి లోకేష్‌కు క్షమాపణలు చెబుతూ.. శిరస్సువంచి నమస్కారాలు చెప్పింది. బెంగళూరు నగరమన్నా.. కన్నడ సంప్రదాయాలన్న తనకు మంచి ఉద్దేశాలే ఉన్నాయని, కన్నడ ప్రజలనుగానీ.. భాషనుగానీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని.. జరిగిందానికి తనను క్షమించాలని ఆ భార్యాభర్తలు వేడుకున్న వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 

 VIDEO CREDITS: TOI Bengaluru

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)