Breaking News

భర్తను అలా చూసి కారు బోనెట్‌పైకి భార్య చివరికి.. వైరల్‌ వీడియో

Published on Wed, 06/10/2026 - 17:19

ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో గుండె ఝల్లుమనే ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అతనిపై నిఘాపెట్టింది. ఇద్దరూ కలిసి ఉండటాన్ని చూసిన  ఆమె వాహనాన్ని ఆపే ప్రయత్నంలో వేగంగా దూసుకెళ్తున్న కారు బోనెట్‌మీదకు లంఘించింది. ఈ ఘటన భమోరా పరిధిలోని దేవ్‌చరా చౌరహా (కూడలి) వద్ద శనివారం సాయంత్రం జరిగినట్లు సమాచారం. ఆమె బోనెట్‌పై వేలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.

గోదావరి (38) , నేత్రపాల్ సింగ్‌ ఇద్దరూ భార్యాభర్తలు. తన భర్త వేరే మహిళతో కలిసి కారులో ప్రయాణించడం చూసి, అతడిని అడ్డుకోడానికి ప్రయత్నించింది. కానీ అతను ఆపకుండా,మరింత వేగం పెంచడంతో, బోనెట్‌పై దూకేసింది. ఆమె బోనెట్‌పై ఉన్నప్పటికీ నేత్రపాల్ కారును ఆపకుండా  100 మీటర్ల దూరం లాక్కెళ్లిన వైనం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. మొత్తానికి  అడ్డుకుని, ఆమెను సురక్షితంగా కిందకు దించారు.  కారు ముందుకు దూసుకెళ్తుంటే, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మహిళ బోనెట్‌ను గట్టిగా పట్టుకున్న దృశ్యాలు వైరల్ వీడియోలో కనిపించాయి. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి.

ఇదీ చదవండి: భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్‌

 భమోరా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. గోదావరి తన భర్త నేత్రపాల్ సింగ్‌కు సాధన అనే మహిళతో అక్రమ సంబంధం ఉందని ఆరోపించింది. ఈ విషయంపై తాను భర్తను ప్రశ్నించినప్పుడల్లా ఆయన తనను తిడుతూ, శారీరకంగా హింసించేవాడని ఆమె తెలిపింది.  ఇద్దరూ కారులో వెడుతుండగా, వారిని ఆపడానికే తాను అలా చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది.తాను  బోనెట్‌పై ఉన్నప్పటికీ నేత్రపాల్ కారును ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాడని ఆమె ఆరోపించింది.  ఈ ఘర్షణలో సాధన తనపై దాడి చేసి, తన మెడలోని బంగారు గొలుసును లాక్కుని అక్కడి నుంచి పారిపోయిందని గోదావరి తన ఫిర్యాదులో పేర్కొంది. అలాగే ఈ రసాభాసలో తన మామయ్య వాహనం కూడా దెబ్బతిన్నట్లు చెప్పింది.

అయితే, సాధన ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. తాను బ్లాక్ ఆఫీస్ నుండి తిరిగి వస్తుండగా నేత్రపాల్ కారులో కేవలం లిఫ్ట్ మాత్రమే తీసుకున్నానని, గోదావరి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని వాదించింది. పైగా ఈ ఘటనలో తనపైనే దాడి జరిగిందని ఆమె ఆరోపించింది.

ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్త

భమోరా ఎస్హెచ్ఓ (SHO) పవన్ కుమార్  స్పందిస్తూ,  నేత్రపాల్ సింగ్, సాధనలపై  ర్యాష్ డ్రైవింగ్, దాడి, ఉద్దేశపూర్వ దాడి లాంటి తీవ్రమైన సెక్షన్ల కింద  కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని,  విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. 

ఇదీ చదవండి: హాట్‌ టాపిక్‌గా 'మా బెహన్' నటి రూ. 14 కోట్ల బంగ్లా

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)