Breaking News

రూ. 40 లక్షల ఎదురు కట్నం కావాలంటూ, కూతురిపైనే తండ్రి దాడి

Published on Thu, 07/30/2026 - 19:05

కర్ణాటకలోని బెంగళూరులో ఒక దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి, వివాహం, డబ్బు విషయంలో విభేదాలతో  ఓ తండ్రి తన కూతురిని అత్యంత దారుణంగా ప్రవర్తించాడు.  కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కర్కశంగా వ్యవహరించిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. పోలీసులు అందించిన సమాచారం  ప్రకారం బెంగళూరులోని ఒక ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది లక్ష్మీ దుర్గ.  ఆమె తండ్రి నాగేంద్ర క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తాడు. ఇటీవల నాగేంద్ర తన కుమార్తె పెళ్లి కోసం ఒక సంబంధం ఖాయం చేశాడు. అయితే, కూతురి చదువు, కెరీర్ కోసం తాను భారీగా ఖర్చు చేశాననే నెపంతో వరుడి కుటుంబం నుండి రూ. 40 లక్షలు డిమాండ్ చేశాడు.

అంతేకాదు లక్ష్మీ దుర్గ ప్రతి నెలా వచ్చే తన జీతం మొత్తాన్ని తనకే ఇవ్వాలని నాగేంద్ర ఒత్తిడి తెచ్చేవాడు. దీన్ని నాగేంద్ర భార్య, కుమార్తె లక్ష్మీ దుర్గ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి.  దీనికితోడు పెళ్లివారిని రూ. 40 లక్షలు ఎదురు కట్నం డిమాండ్‌ చేశాడు. దీన్ని లక్ష్మి తీవ్రంగా వ్యతిరేకించడంతో  ఆమె మీద పగబట్టాడు.  జూలై25 న కన్నకూతురిపైనే కత్తితో దాడికి తెగబడ్డాడు. 

ఇదీ చదవండి: చిన్నప్పటి ఆసక్తే .. రూ. 96 లక్షల ప్రైజ్‌ తెచ్చిపెట్టింది!

కుమార్తెను కలిసే నెపంతో  కాలేజిలోని  హెచ్ఓడి (HOD) ఛాంబర్‌లో ఉన్న లక్ష్మీ దుర్గ వద్దకు వెళ్లిన నాగేంద్ర, వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె కడుపు, ఛాతీ, మెడలో తీవ్రంగా పొడిచి అక్కడ నుండి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మీ దుర్గ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దాడికి కుటుంబంలో దీర్ఘకాలంగా నడుస్తున్న వివాదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు నాగేంద్రను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇదీ చదవండి : భార్యతో జస్ట్‌ 90 సెకన్లు : వ్యాపారవేత్త ఆదిత్య ఆసక్తికర వ్యాఖ్యలు
ఇదీ చదవండి: 144 ఏళ్ల క్రితం దుబాయ్‌ జనాభా 12 వేలు : ఇపుడు ఎంతో తెలుసా?

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)