Breaking News

ప్రదీప్ రావత్ మరణం.. అసలు టాలీవుడ్‌కు ఏమైంది?

Published on Wed, 08/05/2026 - 22:28

సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ హఠాన్మరణం చెందారు. గత ఐదేళ్లుగా బ్లడ్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రదీప్ రావత్‌ సాయంత్రం కన్నుమూశారు ముంబయిలోని గోరెగావ్‌లో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చివరి యాత్రకు పెద్దఎత్తున సినీతారలు హాజరయ్యారు.  ఈ కార్యక్రమానికి అశోక్ పండిట్, అఖిలేంద్ర మిశ్రా, రాజ్ అర్జున్, కరణ్ వి గ్రోవర్, సురేంద్ర పాల్, రుహానికా ధావన్ తదితరులు ఉన్నారు. అంత్యక్రియల సమయంలో రావత్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.

స్పందించని టాలీవుడ్..

బాలీవుడ్ కంటే తెలుగు సినిమాల్లో ఎక్కువగా మెప్పించిన ప్రదీప్ రావత్‌పై టాలీవుడ్ చిన్నచూపు చూసింది. ఆయన మరణం తర్వాత ఏ ఒక్క హీరో సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించలేదు. కేవలం మా అధ్యక్షుడు మంచు విష్ణు మాత్రమే ఆయనను గుర్తు చేసుకున్నారు. ప్రదీప్ రావత్ లేరన్న వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ఆయనకు నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు. 

మంచు విష్ణు సంతాపం.. 

మంచు విష్ణు తన ట్వీట్‌లో రాస్తూ..'ప్రదీప్ రావత్ మరణవార్త విని చాలా బాధపడ్డా. తెరపై, ఆయన పోషించిన ప్రతి పాత్రకు అపారమైన శక్తిని తీసుకొచ్చారు. కానీ తెర వెనుక, ఆయన దానికి పూర్తి విరుద్ధం. ఎంతో వినయశీలి, నిరాడంబరుడు, ఆప్యాయత గలవారు. ఎంతో ఒదిగి ఉండే వ్యక్తి. నేను ఆయనను ఎల్లప్పుడూ అలాగే గుర్తుంచుకుంటాను. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు ఇదే నా హృదయపూర్వక సంతాపం. ఈ కష్ట సమయంలో భగవంతుడు వారికి శక్తిని ప్రసాదించాలని, ఆయన పవిత్రాత్మ శాశ్వత శాంతిని పొందాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి' అంటూ పోస్ట్ చేశారు.

కాగా.. హిందీ మూవీ బాఘితో  సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన ప్రదీప్ రావత్.. తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. సై మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రావత్.. పలు సూపర్ హిట్ చిత్రాల్లో మెప్పించారు. ప్రభాస్ మూవీ ఛత్రపతిలో రాజ్ బిహారీ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత  నాయక్, లక్ష్మీ, భద్ర, దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్‌షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడుశీను, లయన్‌, నాయక్‌, రగడ, బలదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాలతో టాలీవుడ్ సినీ ప్రియులను అలరించారు. ఆయన చివరిసారిగా తెలుగు చిత్రంలోనే కనిపించారు.  తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం చిత్రంలో మెరిశారు.

 

 

Videos

ముదునూరి మురళీ కృష్ణంరాజుకు వైఎస్ జగన్ పరామర్శ

గణేష్ నిమజ్జనంలో సజ్జనార్ డ్యాన్స్ వైరల్

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)