Breaking News

'ధురంధర్ 2'కి భయపడుతున్నారా? ఎందుకీ వాయిదాలు?

Published on Wed, 02/04/2026 - 13:33

కొన్ని సినిమాల విషయంలో అప్పుడప్పుడు ఊహలకు అందనివి జరుగుతుంటాయి. రెండు నెలల క్రితం అలాంటి ఓ సంచలనానికి కారణమైంది 'ధురంధర్' అనే మూవీ. రిలీజ్ వరకు దీనిపై పెద్దగా బజ్ లేదు. రెగ్యులర్ ఆడియెన్స్ కాస్తోకూస్తో ఆసక్తి చూపించారు గానీ సాధారణ ప్రేక్షకుడికి అయితే థియేటర్లలోకి వచ్చేంతవరకు ఇదో సినిమా ఉందని కూడా తెలియదు. అలాంటిది బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేసరికి.. దేశవ్యాప్తంగా పెద్ద డిస్కషన్‌కి కారణమైంది. త్వరలో రాబోతున్న దీని సీక్వెల్ ప్రభావం.. తెలుగు చిత్రసీమపై గట్టిగానే పడినట్లు కనిపిస్తోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)

సాధారణంగా వేసవిని తెలుగు దర్శకనిర్మాత మిస్ చేసుకోరు. ఈసారి కూడా అందుకు తగ్గట్లే డకాయిట్, పెద్ది, ప్యారడైజ్ లాంటి మూవీస్ రిలీజ్ అవుతాయని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. దీంతో ఆయా హీరోల ఫ్యాన్స్, సినిమా లవర్స్ చాలా ఉత్సాహపడ్డారు. తీరా చూస్తే ఈ తెలుగు చిత్రాలన్నీ ఇప్పుడు వాయిదా పడటం గ్యారంటీ. అధికారిక ప్రకటనలు రాలేదు గానీ వాయిదా పడటం అయితే పక్కా.

చరణ్ 'పెద్ది', నాని 'ప్యారడైజ్' సినిమాల షూటింగ్ చాలా పెండింగ్‪‌లో ఉంది. దీంతో ఇవి వాయిదా పడ్డాయంటే సరేలే ఏదో అనుకోవచ్చు. కానీ అడివి శేష్ 'డకాయిట్' మాత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. మార్చి 19న పక్కా వస్తామని శేష్ కూడా కొన్నాళ్ల ముందు జరిగిన ప్రెస్‌మీట్‌లో చెప్పాడు. ఇదంతా 'ధురంధర్' విడుదలకు ముందు జరిగింది. కానీ ఈ మూవీ సూపర్ హిట్ అయ్యేసరికి.. రిస్క్ ఎందుకని 'డకాయిట్' టీమ్ వెనకడుగేసింది. ఏప్రిల్‌లో రావాలని ప్లాన్స్ చేసుకుంటున్నారట.

(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?)

మరోవైపు 'పెద్ది' కోసం అనుకున్న రిలీజ్ తేదీకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని తీసుకురావాలని అనుకుంటున్నట్లు రెండు రోజుల క్రితం వరకు రూమర్స్ వచ్చాయి. ఎప్పుడైతే 'ధురంధర్ 2' రిలీజ్ పక్కా అని క్లారిటీ వచ్చిందో.. 'ఉస్తాద్' టీమ్ రిస్క్ వద్దులే అనుకుందనే టాక్ వినిపిస్తుంది. వీళ్లు కూడా ఏప్రిల్ నెలనే టార్గెట్‌ చేస్తున్నారని టాక్. ఈ లెక్కన చూసుకుంటే మార్చిలో ప్రామిసింగ్ తెలుగు సినిమా ఒక్కటి కూడా వచ్చే సాహసం చేయట్లేదనిపిస్తుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్ 2'కి దాదాపు లైన్ క్లియర్.

అయితే ఈ చిత్రానికి 'టాక్సిక్' పోటీగా నిలబడుతోంది. కన్నడ స్టార్ యష్ నటించిన గ్యాంగస్టర్ డ్రామా మూవీ ఇది. మార్చి 19నే 'ధురంధర్ 2'తో పాటు ఈ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. కాకపోతే ప్రమోషన్ పరంగా చాలా వీక్‌గా ఉన్నారు. సాంగ్స్, ట్రైలర్స్ లాంటివి రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు 'టాక్సిక్' వాయిదా పడటానికి అవకాశాల్లేవని తెలుస్తోంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. విజయ్ 'జన నాయగణ్' నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థనే యష్ మూవీ కూడా తీసింది. ఇది కూడా వాయిదా పడితే కోట్లలో నష్టాలు ఉండొచ్చు. అందుకే 'ధురంధర్ 2' పోటీలో ఉన్నప్పటికీ వెనక్కి తగ్గే పరిస్థితులు అయితే కనిపించట్లేదు.

(ఇదీ చదవండి: 'ధురంధర్'తో హిట్.. ఇప్పుడు చిరంజీవి కూతురిగా?)

Videos

పట్టాభిపురం చేరుకున్న YS జగన్

చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు

గుంటూరుకు చేరుకున్న YS జగన్ కాన్వాయ్

Chiranjeevi : క్యాన్సర్ మహమ్మారిని తేలిగ్గా తీసుకోకండి..

స్పిరిట్ లో అర్జున్ రెడ్డి.. వంగ మాస్టర్ ప్లాన్..!

జగన్ అభిమానులను ఆపేదెవడు.... చేతులెత్తేసిన పోలీసులు..

జగన్ రాకతో దద్దరిల్లిన గుంటూరు

ఏమి జనం సామీ..! గుంటూరులో జన సునామి

ఇసుకేస్తే రాలనంత జనం. ఈ వీడియో చూస్తే చంద్రబాబు ఏమైపోతాడో

YSRCP Leaders : లోకేష్‌కు మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో దద్దరిల్లిన గుంటూరు (చిత్రాలు)

+5

అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. మరిన్ని కొత్త (ఫొటోలు)

+5

ఫుడ్ అంటే ఎంత ఇష్టమో.. ఆషికా క్రేవింగ్స్ (ఫొటోలు)

+5

పశ్చిమ గోదావరిలో ఎంతో ఫేమస్ ఈ ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

నెట్‌ఫ్లిక్స్ గ్రాండ్ ఈవెంట్.. సగం బాలీవుడ్ ఇక్కడే ఉందిగా (ఫొటోలు)

+5

జ్యోతిర్లింగాల యాత్ర మొదలుపెట్టిన హీరోయిన్ (ఫొటోలు)

+5

క్యూట్ జోడీ.. జనవరి ఎంజాయ్ చేశారిలా (ఫొటోలు)

+5

అనసూయ డైలీ రొటీన్ ఇదే.. పోస్ట్ వైరల్ (ఫొటోలు)

+5

హీరోయిన్ జెనీలియా పెళ్లి జ్ఞాపకాలు (ఫొటోలు)