Breaking News

ఓటీటీలో హారర్ అడ్వెంచర్ సిరీస్.. కొత్త సీజన్ ట్రైలర్

Published on Mon, 11/24/2025 - 13:13

ఓటీటీల్లో చాలామంది దాదాపుగా సినిమాలే చూస్తారు. ఇంకొందరు మాత్రం వెబ్ సిరీస్‌లు చూస్తుంటారు. తెలుగులో తక్కువే గానీ ఇంగ్లీష్ భాషలో మాత్రం లెక్కలేనన్ని సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు నచ్చిన వాటిలో నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న 'స్ట్రేంజర్ థింగ్స్' ఒకటి. ఇప్పుడు దీని నుంచి చివరి సీజన్ వచ్చేందుకు సిద్ధమైంది. కానీ దీన్ని మూడు భాగాలుగా రిలీజ్ చేస్తున్నాడు. తొలి పార్ట్ ఈ వారంలోనే రానుండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

2016లో తొలి సీజన్ రాగా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చింది. 2017లో రెండో సీజన్, 2019లో మూడో సీజన్, 2022లో నాలుగో సీజన్ వచ్చాయి. ఇప్పుడు అంటే దాదాపు మూడేళ్ల తర్వాత చివరిదైన ఐదో సీజన్ రాకకు రంగం సిద్ధమైంది. ఒకేసారి కాకుండా మూడు భాగాలు రిలీజ్ చేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం తొలి పార్ట్ ఈ గురువారం(నవంబరు 27) ఉదయం స్ట్రీమింగ్ కానుంది. దాని ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటూ ఎపిసోడ్స్ ఎప్పుడొస్తాయా అనే ఆత్రుత పెంచుతోంది.

గత సీజన్లలన్నీ తెలుగు డబ్బింగ్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు రాబోయే ఐదో సీజన్ కూడా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ వెర్షన్‌లోనూ స్ట్రీమింగ్ కానుంది. నాలుగు ఎపిసోడ్ల తొలి పార్ట్ నవంబరు 27న, మూడు ఎపిసోడ్ల రెండో పార్ట్ డిసెంబరు 25న, క్లైమాక్స్ ఎపిసోడ్ ఉండే చివరి పార్ట్ జనవరి 1న స్ట్రీమింగ్ కానుంది. హారర్ కామెడీ అడ్వెంచర్ కాన్సెప్ట్‌తో దీన్ని తీశారు. హాకిన్స్ అనే ఊరిలో నలుగురు పిల్లలు, వీళ్లకు తోడు మరికొందరు.. వీళ్లంతా కలిసి హంగామానే ఈ సిరీస్. కామెడీకి కామెడీ ఉంటూనే మైండ్ బ్లోయింగ్ స్టోరీ కూడా ఈ సిరీస్‌లో ఉంది.

(ఇదీ చదవండి: మాజీమంత్రి ఎర్రబెల్లితో ఫొటో పంచాయితీ.. బ్రహ్మానందం క్లారిటీ)

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)