Breaking News

'స్ట్రేంజర్ థింగ్స్ 5' ఫినాలే ఎపిసోడ్ ట్రైలర్ రిలీజ్

Published on Tue, 12/30/2025 - 20:48

ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు చూసేవాళ్లకు 'స్ట్రేంజర్ థింగ్స్' గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2016 నుంచి ఇప్పటివరకు నాలుగు సీజన్స్ వచ్చాయి. అవన్నీ కూడా బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. గత నెలలో ఐదో సీజన్ తొలి వాల్యూమ్‌లో నాలుగు ఎపిసోడ్స్, క్రిస్మస్ సందర్భంగా రెండో వాల్యూమ్‌లో మూడు ఎపిసోడ్స్ రిలీజయ్యాయి. సిరీస్ చిట్టచివరి ఎపిసోడ్.. జనవరి 1న రానుంది. దీని ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ థ్రిల్లర్ సినిమా)

ఐదో సీజన్‌లో ఇప్పటివరకు వచ్చిన 7 ఎపిసోడ్స్ గమనిస్తే.. విలన్ వెక్నాతో ఎలెవన్ అండ్ టీమ్ పోరాడటానికి కావాల్సినదంతా సిద్ధం చేశారు. ఇప్పుడు రాబోయే ఫినాలే ఎపిసోడ్‌లో ఎమోషన్‌తో పాటు అదిరిపోయే యాక్షన్ ఉండనుందని ట్రైలర్‌తో హింట్ ఇచ్చారు.

'స్ట్రేంజర్ థింగ్స్' విషయానికొస్తే.. అమెరికాలోని హాకిన్స్ అనే ఊరిలో నలుగురు పిల్లలు ఉంటారు. వీళ్లకు ఓ సూపర్ పవర్స్ ఉన్న ఎలెవన్ అనే అమ్మాయి కనిపిస్తుంది. వీళ్లంతా ఫ్రెం‍డ్స్ అయిపోతారు. అయితే ఎలెవన్.. తనలాంటి అతీత శక్తులుండే కొందరితో పోరాడాల్సి వస్తుంది. ఇంతకీ వాళ్లెవరు? ఎలెవన్ గతమేంటి అనేదే సిరీస్ ప్లాట్ లైన్. ఫాంటసీ టచ్ ఉండే యాక్షన్, అడ్వెంచర్ స్టోరీలు ఇష్టముంటే ఈ సిరీస్ చూడండి. అస్సలు విడిచిపెట్టరు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.

(ఇదీ చదవండి: పెళ్లయిన నెలకు సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)