దురంధర్-2 వసూళ్ల ఊచకోత.. ఆ ఒక్కడి వల్లే రూ.500 కోట్లు..!

Published on Fri, 03/20/2026 - 14:48

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్‌. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత చూపించింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. కేవలం హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. 

తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన చిత్రం దురంధర్ ది రివెంజ్‌. పార్ట్-2గా వచ్చిన ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సారి హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజైంది. కేవలం ప్రీమియర్స్‌తోనే వసూళ్లు సునామీ ప్రారంభించిన బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో దురంధర్‌ నటుడు రాకేశ్ బేడీ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రణ్‌వీర్‌ సింగ్ తనతో ఇలా చెప్పారని గుర్తు చేసుకున్నారు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాకేశ్‌ బేడీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా రోల్ షూటింగ్‌ పూర్తైన రోజు రణ్‌వీర్ తనకు ఓ మాట చెప్పారని గుర్తు చేసుకున్నారు.‌ ఒకవేళ ఈ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూలుచేస్తే.. అందులో రూ.500 కోట్లు రాకేశ్‌ వల్లే వస్తాయని అన్నారని తెలిపారు. ఓ నటుడిగా ఇంతకుమించి ఏం కావాలని హర్షం వ్యక్తం చేశారు. నా చివరి రోజు షూటింగ్‌లో రణ్‌ వీర్‌సింగ్ ఏడ్చారని దర్శకుడు ఆదిత్య ధర్ అన్నారు. సెట్‌లో అంతలా ఎమోషనల్ వాతావరణాన్ని సృష్టించిన మూవీ ‍అని తెలిపారు. కాగా..  ఈ చిత్రంలో రాకేశ్ బేడీ రోల్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. కరాచీకి చెందిన రాజకీయ నాయకుడు జమాలి పాత్రలో రాకేశ్ బేడీ అదరగొట్టేశారు. 

రణ్‌వీర్ సింగ్ ప్రశంసలు..

జమాలిగా బేడీ నటన ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకుంది. ఓ  రాజకీయ నాయకుడి నయవంచక పాత్రలో పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రణ్‌వీర్‌ సింగ్ ప్రశంసలు కురిపించడం చూస్తుంటే బేడీ పాత్ర  ప్రభావం, అలాగే సెట్‌లో వారి మధ్య ఏర్పడిన స్నేహబంధం అర్థమవుతోంది.   కాగా.. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సారా అర్జున్, డానిష్ పాండోర్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు. కాగా.. ధురంధర్ 2 ఫస్ట్ డే, ప్రీమియర్స్‌తో కలిసి  ప్రపంచవ్యాప్తంగా రూ. 172.63 కోట్ల గ్రాస్‌ రాబట్టింది.
 

Videos

రోడ్లపైకి టెస్లా సెమీ ట్రక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 800 KM

పాలు పితుకుతున్నావా..? గాడిదలు కాస్తున్నావా..?

ప్లాన్ మార్చిన అమెరికా.. ట్రంప్ టార్గెట్ ఏంటంటే?

షర్మిల నీ కొడుకును అలా అన్నందుకు కొంచెం కూడా భాద అనిపించలేదా తల్లి..?

చంద్రబాబు టీటీడీ ల్యాబ్ క్రెడిట్ చోరీ

మరో సంచలన వీడియోతో అరవ శ్రీధర్ బాధితురాలు

షర్మిల భర్త అనిల్ ఆయన చెల్లెళ్ళకు సగం ఆస్తి పంచాడా...?

ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు

యుద్దానికి ముగింపు..? హంటింగ్ ఆఫ్ హార్మూజ్

రాజంపేటలో దారుణం.. వదినపై మరిది లైంగిక దాడి

Photos

+5

వాళ్లు అప్పుడు నాకు సూపర్‌స్టార్స్‌.. ఇప్పుడు నేను (ఫొటోలు)

+5

గద్దర్ అవార్డ్ వేడుక కోసం అక్కినేని కోడలు ఇలా (ఫొటోలు)

+5

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)

+5

శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం పులకించిన భక్తులు (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్ అందుకున్న విజేతలు (ఫొటోలు)

+5

అట్టహాసంగా గద్దర్ అవార్డుల వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

పేరేంట్స్‌గా మాకు గర్వకారణం.. కుమారుడి ఈవెంట్‌లో శివబాలాజీ దంపతులు (ఫొటోలు)

+5

టాలీవుడ్ జంట కిరణ్ అబ్బవరం- రహస్య ఉగాది వేడుకలు (ఫొటోలు)

+5

ఉగాది స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ ఇలా (ఫొటోలు)