Breaking News

బిగ్‌బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్!

Published on Sat, 10/25/2025 - 18:24

బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఒక్కో కంటెస్టెంట్ ఒక్కోలా గేమ్ ఆడుతుంటారు. అయితే వీళ్లలో మధ్యలోనే ఎవరు బయటకొచ్చేస్తారు, ఎవరు చివరి వరకు ఉంటారనేది ఎప్పుడు సస్పెన్స్‌గానే ఉంటుంది. గతవారం అలా భరణి ఎలిమినేట్ కాగానే చాలామంది ఆశ్చర్యపోయారు. ఈసారి అంతకు మించి బిగ్‌బాస్ షాక్ ఇచ్చాడు. పచ్చళ్ల పాపని బయటకు పంపేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?

సోషల్ మీడియాలో పచ్చళ్ల బిజినెస్‌ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లలో రమ్య ఒకరు. రెండు వారాల క్రితం ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా 9వ సీజన్‌లో అడుగుపెట్టింది. కానీ వచ్చిన తొలిరోజు నుంచే టాక్ ఆఫ్ ది హౌస్ అయిపోయింది. ఫిజికల్ టాస్క్‌ల్లో మగాళ్లతోనే బాగానే పోటీ పడుతున్నప్పటికీ నోటి దురుసు, వ్యక్తిగతంగా పలువురు కంటెస్టెంట్స్‌పై కామెంట్స్ చేయడం లాంటి వాటి వల్ల నెగిటివిటీ వచ్చింది. దానికి తోడు వచ్చిన మొదటిరోజునే తనూజ-కల్యాణ్ రిలేషన్ గురించి అనవసర వ్యాఖ్యలు చేయడం కూడా ఈమెకు కాస్త మైనస్ అయ్యాయని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: నాగార్జున రూట్‌లోనే చిరంజీవి.. కోర్ట్ ఆదేశాలు)

ఇకపోతే ఈ వారం రమ్యతో పాటు రీతూ, సాయి శ్రీనివాస్, దివ్య, తనూజ, రాము, సంజన, కళ్యాణ్ నామినేషన్స్‌లో నిలిచారు. వీళ్లలో చూస్తే రమ్య, సాయి తప్పితే మిగిలిన వాళ్లంతా చాలారోజులుగా హౌస్‌లో ఉన్నారు. పలుమార్లు నామినేషన్స్‌లోనూ ఉన్నారు. దీంతో ఈ వారం వీళ్లందరికీ బాగానే ఓట్లు పడ్డాయి. ఓటింగ్ పరంగా చూసుకుంటే తనూజ టాప్‌లో నిలిచినట్లు తెలుస్తోంది. తర్వాతి స్థానాల్లో కల్యాణ్, దివ్య, రీతూ, సంజన ఉన్నట్లు టాక్. చివరి మూడు స్థానాల్లో రాము, సాయి శ్రీనివాస్, రమ్య ఉండగా.. రమ్యగా చాలాతక్కువగా ఓటింగ్ రావడంతో ఈమెని ఎలిమినేట్ చేసేశారట.

వాస్తవానికి ఈ వారం ఇప్పటికే ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయింది. ఆమెనే ఆయేషా. డీహైడ్రేషన్, జ్వరం లక్షణాలతో ఈమె హౌస్ నుంచి బయటకొచ్చేసింది. కానీ కొన్నిరోజుల తర్వాత తిరిగి హౌసులోకి వెళ్లే అవకాశముంది. అయితే ఆయేషా బయటకొచ్చేయడంతో ఈ వారం ఎలిమినేషన్ ఉండదేమోనని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదని ఫిక్స్ అయిన నిర్వహకులు.. పచ్చళ్ల పాప రమ్య మోక్షని ఎలిమినేట్ చేసేసినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: నా దొంగ మొగుడు.. ప్రశాంత్ నీల్ భార్య పోస్ట్ వైరల్)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)