Breaking News

కన్నీళ్లు ఆపుకోలేకపోయిన ది రాజా సాబ్‌ డైెరెక్టర్‌ కూతురు.. వీడియో వైరల్!

Published on Sun, 12/28/2025 - 13:40

ప్రభాస్ -మారుతి డైరెక్షన్‌లో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రిలీజ్‌ తేదీ దగ్గర పడడంతో హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు మేకర్స్.

ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ మారుతి ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ప్రభాస్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. మూడేళ్లుగా ది రాజాసాబ్‌ కోసం పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. రెబల్ స్టార్‌ను తీసుకొచ్చిన ఆయన రేంజ్‌కు తగినట్లుగానే ఈ సినిమాను తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ  సినిమా కోసం ప్రభాస్‌ తన లైఫ్‌ పెట్టేశారని కొనియాడారు. సినిమాతోనే ఏకమైపోయిన తీరును మాటల్లో చెప్పలేనన్నారు. ఆ ప్రతి రూపమే ఈ రోజు మన ఎదురుగా కూర్చుందని డైరెక్టర్‌ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టిన ప్రభాస్‌ను చూస్తుంటే నా కన్నీళ్లు ఆగడం లేదంటూ వేదికపైనే ఏడ్చేశారు. ఈ సందర్భంగా వేదికపైనే చిన్నపిల్లాడిలా దర్శకుడు మారుతి ఏడ్చిన తీరు ఆడియన్స్‌ను సైతం కన్నీళ్లు పెట్టించింది.

మారుతి కూతురు ఎమోషనల్

ఈ వీడియో చూసిన ఆయన కూతురు ఈవెంట్‌లోనే కన్నీళ్లు పెట్టుకుంది. తండ్రి కష్టాన్ని చూసిన కూతురు కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తండ్రి కంటే ఎక్కువగా ఎమోషనలైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఒక తండ్రి కష్టం విలువ.. కుమార్తెకే తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)