Breaking News

కొత్త తెలుగు సినిమాలు.. డైరెక్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్

Published on Mon, 10/13/2025 - 12:55

ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. థియేటర్లకు వెళ్లే జనాలు వెళ్తూనే ఉన్నారు. కాకపోతే చాలామంది.. ఓటీటీలో రిలీజైన తర్వాతే మొబైల్ లేదా టీవీల్లో కొత్త సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సంస్థలు కూడా కేవలం ఓటీటీల్లో కొన్నింటిని నేరుగా విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు అలానే నెట్‌ఫ్లిక్స్ సంస్థ తమ దానిలో రాబోయే పలు తెలుగు, తమిళ చిత్రాలు, వెబ్ సిరీసుల గురించి అధికారిక ప్రకటన చేసింది.

'ఓజీ'తో రీసెంట్‌గా హిట్ కొట్టిన ప్రియాంక మోహన్ చేసిన తమిళ మూవీ 'మేడ్ ఇన్ కొరియా'. గత కొన్నాళ్ల నుంచి కొరియన్ చిత్రాలు, సిరీస్‌లకు చాలామంది అమ్మాయిలు ఫ్యాన్స్ అయిపోతున్నారు. అలాంటి ఓ అమ్మాయి కొరియా వెళ్లిన తర్వాత ఏం జరిగిందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీసినట్లు కనిపిస్తుంది. ఆర్ఏ కార్తీక దీనికి దర్శకుడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు)

ఆనంద్ దేవరకొండ, 'లాపతా లేడీస్' ఫేమ్ నితాన్షీ గోయల్ జంటగా నటించిన సినిమా 'తక్షకుడు'. వేటగాడి చరిత్రలో జింకపిల్లలే నేరస్థులు అనే ట్యాగ్ లైన్‌తో రాబోతుంది. పోస్టర్ చూస్తుంటే ఇదో రూరల్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. గతంలో ఆనంద్ దేవరకొండతోనే 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అనే మూవీ తీసిన వినోద్ అనంతోజు దీనికి దర్శకుడు.

సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సిరీస్ 'సూపర్ సుబ్బు'. మిథిలా పాల్కర్, మురళీ శర్మ ఇతర పాత్రలు చేస్తున్నారు. ఓ టీచర్.. పల్లెటూరికి వెళ్లి స్కూల్లో పిల్లలకు సె*క్స్ ఎడ్యుకేషన్ నేర్పించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది ఫన్నీగా చూపించబోతున్నారు. ఎనిమిది నెలల క్రితం ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేశారు. 

అయితే ఈ చిత్రాలన్నీ కూడా త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే స్ట్రీమింగ్ కాబోతున్నాయని చెప్పారు. మరి ఈ ఏడాదిలోనే రిలీజ్ చేస్తారా? వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకొస్తారా అనేది చూడాలి.

(ఇదీ చదవండి: Bigg Boss 9: ఫ్లోరా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?)

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)